|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని) క్రిస్మస్ కేకులు
కావలసిన వస్తువులు:
|
కరిగించిన వెన్న |
- |
100 గ్రా. |
|
పంచదార పొడి |
- |
1/2 కప్పు. |
|
ఆరంజ్ రసం |
- |
సగం పండు. |
|
పైనాపిల్ ముక్కలు |
- |
1 కప్పు (సన్నగా తరిగినవి). |
|
మైదాపిండి |
- |
2 కప్పులు. |
|
జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులు |
- |
2 చెంచాలు. |
|
మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ |
- |
100 గ్రా. |
తయారు చేసే విధానం:
పంచదార పొడిని ఆరంజ్ రసంలో కలిపి, వెన్న, పిండి కూడా చేర్చి పిండిని కొంచం జారుగా కలుపుకోవాలి. పళ్ళముక్కలు, జీడిపప్పు ముక్కలు కూడా కలిపి ఈ పిండిని చిన్న చిన్న కేక్ ఫ్యాన్ల (గిన్నె)లోకి తీసుకుని ఒక ట్రేలో పెట్టి 20 నిమిషాలు 350 డిగ్రీల ఫారన్‌హీట్‌లో లేదా 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో బేక్ చేసుకోవాలి.
కావలసిన వస్తువులు:
|
కరిగించిన వెన్న |
- |
50 గ్రా. |
|
పంచదార పొడి |
- |
50 గ్రా. |
|
గుడ్డు |
- |
1. |
|
ఐసింగ్ షుగర్ |
- |
140 గ్రా. |
|
మైదాపిండి |
- |
100 గ్రా. |
|
బేకింగ్ పౌడర్ |
- |
1/2 చెంచా. |
|
వెనిల్లా ఎస్సెన్స్ |
- |
1/4 చెంచా. |
|
వేడి నీళ్ళు |
- |
1 1/4 గరిటెడు. |
|
గులాబిరంగు |
- |
కొద్దిగా. |
తయారు చేసే విధానం:
మైదా, బేకింగ్ పౌడర్ జల్లించుకోవాలి. వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేసుకోవాలి. గుడ్డు లోని సొనను, వెనిల్లా ఎస్సెన్స్‌ను బాగా గిలకొట్టాలి. ఓ పక్క ఇలా చేస్తూనే క్రీముకు కలపాలి. పై మిశ్రమానికి మైదాను బాగా కలిపి, అవసరమైతే కాస్త పాలు కలిపి, కాస్త జారుగా చేయాలి. పిండిని రెండు సమభాగాలుగా చేసుకుని, ఒక భాగానికి గులాబిరంగు కలపాలి. రంగు కలిపిన పిండిని, మామూలు పిండిని విడి విడిగా పేపర్ కప్పుల్లో సగానికి పోసి, ట్రేలో ఉంచి 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ఓవెన్‌లో 2 నిమిషాలపాటు బేక్ చేసుకోవాలి. కేక్స్ చల్లారాక గ్లేజ్ ఐసింగ్‌తో అలంకరించాలి.
గ్లేజ్ ఐసింగ్ చేసే విధానం
ఐసింగ్ షుగర్‌ను జల్లించి, ఒక గిన్నెలో వేయాలి. వేడినీళ్ళను ఐసింగ్ షుగర్‌కు కొద్ది కొద్దిగా స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. వేడినీళ్ళలో కరిగిన ఐసింగ్ షుగర్ స్పూన్‌కు కోటింగ్‌లా అతుక్కునేంత వరకు కలిపి, కొన్ని చుక్కల వెనిల్లా ఎస్సెన్స్‌ను వేసి కలపాలి. ఆ మిశ్రమం వేడిగా ఉండగానే పింక్ గులాబి రంగు కేకుల మీద పొయ్యాలి. సగం మిశ్రమం గులాబిరంగు కేక్‌ల మీద పోసి, మిగిలిన సగంలో గులాబి రంగు కలిపి రంగులేని మామూలు కేక్‌ల మీద పొయ్యాలి. ఈ కేకులను ఇంకా వెరైటీగా కావాలంటే ఫుడ్ కలర్స్, ఎస్సెన్స్ మార్చుకోవచ్చు.
కావలసిన వస్తువులు:
|
వెన్న |
- |
30 గ్రా. |
|
పంచదార పొడి |
- |
50 గ్రా. |
|
గుడ్డు |
- |
1. |
|
పాలు |
- |
15 మి.లీ |
|
మైదాపిండి |
- |
50 గ్రా. |
|
బేకింగ్ పౌడర్ |
- |
1/4 చెంచా. |
|
ఎండు ద్రాక్ష |
- |
30గ్రాములు. |
|
వెనిల్లా ఎస్సెన్స్ |
- |
కొన్ని చుక్కలు. |
తయారు చేసే విధానం:
ఎండుద్రాక్ష తొడిమలు తీసి, నీళ్ళతో శుభ్రం చేయాలి. తర్వాత ఒక ఉతికిన, శుభ్రమైనబట్టతో తడి లేకుండా తుడవాలి. మైదాను, బేకింగ్ పౌడర్‌ను జల్లించాలి. వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేయాలి. వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమానికి ఎండు ద్రాక్ష చేర్చాలి. మైదాను కూడా కలిపి, పిండి జారుగా ఉండేందుకు కాసిని పాలు కలపాలి. ఇప్పుడు పిండిని పేపర్ కప్స్‌లో పోసి 400 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 25 నిమిషాల పాటు బేక్ చేయాలి.
కావలసిన వస్తువులు:
|
పాలు |
- |
5 కప్పులు. |
|
పంచదార |
- |
4 కప్పులు. |
|
బొంబాయి రవ్వ |
- |
1 కప్పు. |
|
నెయ్యి |
- |
11/2 కప్పు. |
తయారు చేసే విధానం:
పాలు, పంచదార, బొంబాయిరవ్వ, నెయ్యి అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి సన్నని సెగపై పెట్టి పాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. స్వీటు దగ్గరికి వచ్చే వరకు ఉంచి నెయ్యి పైకి తేలాక నెయ్యి రాసిన ట్రేలో పోసి పైన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి చల్లార్చాలి. ఆపైన కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి.
కావలసిన వస్తువులు:
|
పేమిరవ్వ లేదా బొంబాయి రవ్వ |
- |
1 కప్పు. |
|
మైదా |
- |
1 కప్పు. |
|
పాలు |
- |
4కప్పులు. |
|
పంచదార |
- |
1 1/2 కప్పులు. |
|
మంచినీళ్లు |
- |
1 కప్పు. |
|
ఎసెన్స్ |
- |
3చుక్కలు. |
|
బాదం, పిస్తాపప్పు |
- |
కొద్దిగా. |
|
నూనె |
- |
వేయించడానికి సరిపడా. |
తయారు చేసే విధానం:
మైదా, బొంబాయి రవ్వల్ని బాగా కలిపి అందులో పాలు పోసి పూరీ పిండిలా కలపాలి. ఈ పిండిముద్దను ఫ్రిజ్‌లోగానీ తడిబట్ట కప్పిగానీ పది నిమిషాలు ఉంచాలి. స్టవ్‌మీద పాత్ర పెట్టి పంచదార, నీళ్లు కలిపి పాకం తయారుచేసి అందులో ఎసెన్స్ కలిపి ఉంచాలి. తరవాత బాణలిలో నూనె పోసి కాగాక పిండిని చిన్నసైజు పూరీల్లా మందంగా ఒత్తుకుని రెండువైపులా బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించి తీసి వెంటనే పాకంలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీయాలి. చివరగా వీటిమీద బాదం, పిస్తా పప్పుల్ని ముక్కలుగా చేసి చల్లాలి.

కావలసిన పదార్థాలు :
|
మైదాపిండి |
- |
200 గ్రాములు |
|
పంచదారపొడి |
- |
200 గ్రాములు |
|
నెయ్యి |
- |
200 గ్రాములు |
|
గుడ్లు |
- |
నాలుగు |
|
బేకింగ్ పౌడర్ |
- |
1 టేబుల్ స్పూన్ |
|
వెనీల టేబుల్ |
- |
1 టేబుల్ స్పూన్ |
ఐసింగ్ కోసం..
వెన్న 100 గ్రాములు, ఐసింగ్ సుగర్ 200 గ్రాములు
తయారీవిధానం:
మైదాపిండి జల్లించండి. ఈ పిండిని ఓ గిన్నెలోని తీసుకుని అందులో గుడ్లు, పంచదార, వెన్న, బేకింగ్ పౌడర్, ఎసెన్స్ వేయండి. వీటన్నింటినీ చేత్తో కానీ.. ఎలక్ట్రిక్ బీటర్‌తో కానీ బాగా కలపండి. ఓ మోస్తరు వెడల్పున్న గుండ్రని గిన్నెలు రెండు తీసుకోండి. వాటికి నూనె కానీ, నెయ్యి కానీ రాసి ఈ మిశ్రమాన్ని వాటిల్లో వేసి బేక్ చేయండి. కేకులు తయారయ్యాయా? వాటిని కాస్త చల్లారనివ్వండి. ఒక కేకును ముఖంలా వాడుకోవచ్చు. మరో కేకును తీసుకొని ఫోటోలో చూపినట్లు చెవులు, కాలర్ ఆకారంలో నిదానంగా కట్ చేయండి. చెవుల కోసం కత్తించి పెట్టుకున్న కేకును కింది భాగంలో కాస్త కట్ చేస్తే సరైన ఆకారం వస్తుంది. వీటిని పైభాగంలో, కాలర్ ముఖానికి కింది భాగంలో పెట్టాలి. ఫోటోలో చూస్తున్నారుగా.. అలాగే రావాలి. ఐసింగ్ చేయడానికి బన్నీ కేక్ సిద్ధం!
ఇప్పుడు ఓ గిన్నెలో బట్టర్ తీసుకుని బాగా గిలకొట్టాలి. ఇప్పుడు దీనికి కొద్దికొద్దిగా ఐసింగ్ సుగర్ చేర్చుతూ నిదానంగా కలపాలి. ఈ మిశ్రమానికి వెనీలా ఎసెన్స్ చేర్చాలి. ఐసింగ్ గట్టిగా అయితే కొద్దిగా పాలు కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూడు చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకోండి. వాటిని గులాబీ, నీలి, ఎరుపు, మీకిష్టమైన రంగులు కలపండి. ముందే సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ మీద ఐసింగ్‌ను సమాంతరంగా పరవాలి. ఐసింగ్‌బ్యాగ్ సాయంతో ఔట్‌లైన్, కళ్లు, ముక్కు, నోరు గీసేయాలి. చూడచక్కని బన్నీకేక్ రెడీ!
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in