www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు(కొన్ని)

సగ్గుబియ్యంతో కిచిడీలు

కావలసిన వస్తువులు:

సగ్గుబియ్యం

-

1కప్పు.

వేయించిన వేరుశనగలు

-

 1/2 కప్పు.

జీలకర్ర

-

 కొద్దిగా.

పంచదార

-

 కొద్దిగా.

పచ్చిమిరపకాయలు

-

2 (తరగాలి).

ఉప్పు

-

తగినంత.

సన్నగా తరిగిన అల్లం ముక్కలు

-

కొద్దిగా.

పచ్చికొబ్బరి తురుము

-

1గరిటెడు.

నూనె

-

1 గరిటెడు.

తరిగిన కొత్తిమీర

-

 2 చెంచాలు.

తయారు చేసే విధానం :

సగ్గుబియ్యం కడిగి నీళ్ళు వంపి, తిరిగి నీళ్ళుపోసి పక్కకు పెట్టుకోవాలి. ఒక మూకుడులో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తరువాత అల్లం ముక్కలు, పచ్చిమిరపముక్కలు వేసి తరువాత సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. వేరుశనగలు, ఉప్పు, పంచదారవేసి బాగా కలిపి కొద్దిగా నీళ్ళుపొయ్యాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ 30 నిమిషాలు ఉడికించాలి. ఈ కిచిడీపైన తరిగిన కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము చల్లి వేడివేడిగా వడ్డించండి.

అటుకులతో కిచిడీ

కావలసిన వస్తువులు:

పచ్చిమిరపకాయలు

-

2.

ఎండుమిరపకాయలు

-

1.

బిరియానీ ఆకులు

-

2.

సన్నగా తరిగిన అల్లం ముక్కలు

-

1 చెంచా.

జీలకర్ర

-

1/2 చెంచా.

పసుపు

-

1/2 చెంచా.

ధనియాల పొడి, జీలకర్ర

-

1/2+1/2చెంచా.

తురిమిన కొబ్బరి

-

2 గరిటెలు.

ఉప్పు, పంచదార

-

 ఇష్టమైనంత.

రిపైండ్ ఆయిల్

-

 2 గరిటెలు.

నెయ్యి

-

1 గరిటెడు.

తయారు చేసే విధానం :

ఆలుగడ్డ, గోబీపువ్వు ముక్కలు చేసుకోవాలి. ఒక మూకుడులో నూనె వేడిచేసి అందులో ఆలుగడ్డ, గోబీముక్కలు వేసి కొద్దిగా ఉడికేవరకు వేయించాలి. అందులో పచ్చిబఠాణీ, కొబ్బరి తురుముకూడా వేసి వేయించాలి.

వేరొక మూకుడులో నూనె వేడిచేసి అందులో ఎండు మిరపకాయ, జీలకర్ర, బిరియానీ ఆకు వేసుకోవాలి తరువాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసి వేయించాలి.

తరువాత అటుకులు కూడా వేసి బాగా కలపాలి. అన్నం కూడా వేసి కలపాలి. ఉడికించిన కూరముక్కలు ఇందులో వేసి కలపాలి. ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇందులో కొద్దిగా నీళ్ళుపోసి కొద్దిసేపు మూతవేసి ఉంచాలి.

 అటుకులు కూడా మొత్తబడిన తరువాత ఇందులో నెయ్యివేసి రెండు నిమిషాలు ఉడికించి. ఇష్టమైన వారు గరం మసాలా కూడా వేసి కలిపి దించాలి. వడ్డించే ముందు పైన కాస్త కొత్తిమీర, కాస్త పచ్చి కొబ్బరి పొడి చల్లి వడ్డించండి.

కిచిడి(కందులతో)

కావలసిన వస్తువులు:

బాస్మతి లేక సోనా మసూరు బియ్యం

-

రెండు కప్పులు.

పచ్చికందిగింజలు

-

ఒక కప్పు.

టమోటాలు

-

 రెండు.

ఆలుగడ్డ

-

ఒకటి.

పచ్చిమిరపకాయలు

-

 ఆరు.

ఉల్లిపాయ

-

ఒకటి.

 షాజీరా, జీలకర్ర

-

 అర టీ స్పూను.

పలావు ఆకులు

-

రెండు.

దాల్చిన చెక్క

-

ఒకటి.

కరివేపాకు

-

రెండు రెబ్బలు.

పసుపు

-

పావు టీ స్పూను.

నెయ్యి లేక డాల్డా

-

పావు కప్పు.

ఉప్పు

-

 సరిపడినంత.

తయారు చేసే విధానం :

ముందుగా బియ్యాన్ని రెండుసార్లు కడిగి నాలుగు కప్పులు నీరుపోసి ఇరవై నిముషాలు నాననివ్వాలి. తర్వాత కుక్కర్ లేక గిన్నెలో నెయ్యి లేక డాల్డా వేయాలి. అది వేడెక్కాక అందులో జీలకర్ర, షాజీరా, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, చీల్చిన పచ్చిమిరపకాయలు,   దాల్చిన చెక్క, పలావు ఆకులు, కరివేపాకు, ఆలుగడ్డ ముక్కలు, పచ్చి కంది గింజలు వేయాలి. అవి రెండు నిమిషాలు వేగాక టమోటా ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు, నీటితో సహా బియ్యం వేసి బాగా కలిపి ఉడికించాలి. వేడిగా తింటే రుచిగా ఉంటుంది.

సేమ్యాతో అరిసెలు

కావలసిన వస్తువులు:

నెయ్యి

-

అర కిలో.

 బియ్యం

-

అర కిలో.

 సేమ్యా

-

పావు కిలో.

 తెల్లనువ్వులు

-

100 గ్రాములు.

పంచదార

-

పావు కిలో.

గసగసాలు

-

10 గ్రా.

యాలుక్కాయ పొడి

-

సరిపడినంత.

తయారు చేసే విధానం :

ముందురోజు రాత్రి బియ్యాన్ని నీళ్లలో నానబోయాలి. ఉదయం పిండి దంచాలి. తర్వాత మెత్తటిపిండిని జల్లెడ పట్టాలి. సేమ్యాని కొలిచి అంతే నీళ్లని ఒక గిన్నెలో తీసుకోవాలి. బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి సేమ్యాని అందులో వేయాలి. కొద్దిగా వేగినట్టు అయిన తర్వాత కొలత నీళ్లు ఆ బాణలిలో పోసి రెండు నిమిషాలు మూతపెట్టాలి. సేమ్యా మెత్తపడ్డాక దించేయాలి. అందులో యాలుకపొడి, తెల్లనువ్వులు, గసగసాలు వేసి పక్కన పెట్టుకోవాలి. అడుగున బాగా మందమున్న గిన్నెలో పంచదార పోసి కొద్దిగానీళ్లు జతచేర్చి స్టవ్ మీద సన్నటి సెగపై పెట్టాలి. ముదురు పాకంలోకి వచ్చిన తర్వాత జల్లెడ పట్టిన బియ్యంపిండిని అందులో పోసి ఉండ లేకుండా దగ్గరకు తిప్పాలి. అప్పుడే సేమ్యా మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా కలపాలి. ఆ పిండితో అరిసెలా చేసి నెయ్యిలో వేగించాలి. ఎర్రగా వేగినతర్వాత అరిసెల గెరిటతో వత్తి ఆరబెట్టి తింటే చాలా బాగుంటాయి. సేమ్యా అరిసెలను డబ్బాలో నెల రోజుల పాటు నిల్వచేసుకుని తినొచ్చు.

బొబ్బట్లు

కావలసిన వస్తువులు:

మైదాపిండి

-

1/2 కిలో.

పూర్ణంకోసం:

-

 

పచ్చి శనగపప్పు

-

2 కప్పులు.

బెల్లం తురుము

-

2 కప్పులు.

యాలుకుల పొడి

-

1 చెంచా.

నెయ్యి

-

తగినంత.

తయారు చేసే విధానం:

మైదాపిండి నూనె, కొద్దిగా నెయ్యివేసి చపాతీ పిండిలా కలిపి నానబెట్టుకోవాలి.

శనగపప్పును ఉడికించి నీళ్ళు వంపుకోవాలి. తర్వాత గ్రైండర్‌వేసి మెత్తగా రుబ్బాలి. బెల్లం కొద్దిగా నీళ్ళుపోసి, శనగపప్పు ముద్దను వేసి అందులో యాలుకుల పొడి కూడా కలుపుకోవాలి.  ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మైదాపిండిని మొదట పూరీలా చేసుకుని మధ్యలో శనగపప్పు ముద్దను ఉంచి చుట్టూ మైదాపిండితో కప్పేసి, తిరిగి చేత్తో వత్తుకోవాలి. దీన్ని పెనం పైన వేసి చపాతీలా రెండుపక్కలా నేతితో కాల్చాలి. బొబ్బట్లు తక్కువ మంటమీద కాలిస్తే మంచిది.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in