|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
కావలసిన వస్తువులు:
|
పాలు |
- |
5 లీటర్లు. |
|
చక్కెర |
- |
300 గ్రా. |
|
నెయ్యి |
- |
250 గ్రా. |
|
జీడిపప్పు |
- |
కావలసినన్ని. |
|
కిస్‌మిస్ |
- |
కావలసినన్ని. |
తయారు చేసే విధానం:
గిన్నెలో పాలు, చక్కెర మిశ్రమాన్ని తీసుకుని సన్నని సెగపై పాలు చిక్కబడేవరకు మరిగిస్తూ ఉండాలి. నెయ్యి, తరిగిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి కలిపి మరికొద్దిసేపు మరిగించాక మిశ్రమాన్ని ట్రేలో పోయాలి. మిశ్రమం చల్లబడ్డాక కావలసిన సైజులో కట్ చేసుకోవాలి.
[ వెనుకకు ]
మూలం: ఆదివారం వార్త వార పత్రిక 6, మార్చి, 2005
కావలసిన వస్తువులు:
|
బొంబాయి రవ్వ |
- |
రెండు కప్పులు. |
|
తురిమిన పచ్చికొబ్బరి |
- |
రెండు కప్పులు. |
|
పంచదార |
- |
1 1/2 కప్పు. |
|
నెయ్యి |
- |
అర కప్పు. |
|
జీడిపప్పు |
- |
రెండు స్పూన్‌లు. |
|
కిస్ మిస్ |
- |
రెండు స్పూన్‌లు. |
|
యాలుకల పొడి |
- |
పావు స్పూన్. |
తయారు చేసే విధానం:
మొదట దళసరి (బాణలీ) మూకుడులో రవ్వను కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. దీనిలో కొబ్బరి తురుము, పంచదార వేసి నీరు కొద్దిగా పోసి కలియ బెట్టాలి. చెక్కర కరిగి గట్టిపడుతున్నదను కున్నప్పుడు యాలుకల పొడి చల్లి దించుకోవాలి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి గుండ్రంగా లడ్డూలు చుట్టుకోవాలి, కొంచెం పాలు చల్లుకుంటూ ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి.
[ వెనుకకు ]
మూలం: ఆదివారం తేజ వార పత్రిక 21, జనవరి, 2007.
కావలసిన వస్తువులు:
|
బొంబాయి రవ్వ |
- |
1 కప్పు. |
|
పంచదార |
- |
1 కప్పు. |
|
నెయ్యి |
- |
అర కప్పు. |
|
జీడిపప్పు |
- |
రెండు స్పూన్‌లు. |
|
నీళ్ళు లేదా పాలు |
- |
2 కప్పులు లేదా రెండున్నర కప్పులు. |
|
కేసరి రంగు |
- |
కావలసినంత. |
|
జీడిపప్పు |
- |
రెండు స్పూన్‌లు. |
|
కిస్ మిస్ |
- |
రెండు స్పూన్‌లు. |
|
యాలుకుల పొడి |
- |
పావు స్పూన్. |
తయారు చేసే విధానం:
ముందుగా బొంబాయి రవ్వ, పంచదార కలిపి ఉంచుకోవాలి, తరువాత ఒక గిన్నెలో నీళ్ళు లేక పాలు పోసి స్టవ్ మీద పెట్టి బాగా కాగిన తరువాత, కేసరి రంగు కూడా అందులో వేసి గరిటతో కలపాలి. తరువాత ఆ కలిపిన రవ్వ, పంచదార, యాలుకుల పొడి, ఒకేసారి పోస్తూ ఉండలు కట్టకుండా కలియబెడుతూ ఉడికేంత వరుకు ఉంచాలి. కొంచెం నెయ్యి కూడా అందులో వేసి కలపాలి. తరువాత నేతిలో జీడిపప్పు వేయించి అందులో కలపాలి. ఇప్పుడు కేసరి రడీ. ఇప్పుడు దానిని కప్పులలో పెట్టుకొని తినవచ్చు. అలా కాకుండా కేసరి రడీ అయిన తరువాత ఒక ప్లేట్‌లో నెయ్యి రాసి అందులో ఆ కేసరి వేసి కావలసిన ఆకారంలో ముక్కలు కోసి దాని మీద మళ్ళీ కాజు, కిస్ మిస్ అంటిస్తే చూడ ముచ్చటగా తినాలనిపించేలా ఉంటుంది.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
శనగపిండి |
- |
1/2 కిలో |
|
పంచదార |
- |
2 గిద్దలు |
|
డాల్డా |
- |
1/2 గిద్ద |
|
షోడా ఉప్పు |
- |
చిటికెడు |
|
నూనె |
- |
వేయించడానికి సరిపడినంత. |
|
యాలుకల పొడి |
- |
పావు స్పూన్. |
|
జీడి పప్పు (కాజు) |
- |
సరిపడినన్ని. |
తయారు చేసే విధానం:
శనగపిండిలో షోడా ఉప్పు, కొంచెం నూనె, నీళ్ళు పోసి చక్రాల పిండిలా కలపాలి, తరువాత వాటిని చక్రాలులా వండాలి. అవి లేత రంగులో ఉండేలా చూడాలి. వీటిని తరువాత మిక్సీలో వేసి మెత్తగా పిండిలా చేసుకోవాలి. తరువాత ఒక డబ్బా పంచదారలో కొద్దిగా నీరు పోసి తీగపాకం వచ్చిన తరువాత ఈ పిండి పోసి కలపెట్టాలి. డాల్డా, యాలుకల పొడివేసి బాగా కలపాలి. చేతికి నెయ్యి రాసుకొని ముద్దలు చెయ్యాలి. ఒకొక్క లడ్డు మీద ఒకొక్క జీడిపప్పు అంటిస్తే బాగుంటుంది.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
మెంతికూర |
- |
1 కట్ట (పెద్దది). |
|
టమోటాలు |
- |
2. |
|
వెల్లుల్లి రేకలు |
- |
4. |
|
నూనె |
- |
3 టీ స్పూన్లు. |
|
మెంతులు |
- |
అర టీ స్పూను. |
|
ఎండుమిర్చి |
- |
2. |
|
పచ్చిమిర్చి |
- |
2. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
పసుపు |
- |
చిటికెడు. |
తయారు చేసే విధానం :
మెంతికూర కాడలు లేకుండా శుభ్రంచేసి సన్నగా తరిగి ఉంచాలి. స్టవ్‌మీద కళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి దానిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. సగం మగ్గిన తరువాత టమోటాలు కూడా వేసి మూత పెట్టాలి. బాగా మగ్గిన తరవాత దించి చల్లారనివ్వాలి.
మిగిలిన నూనెలో ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. తరువాత వీటికి వెల్లుల్లి, ఉప్పు, పసుపు జోడించి అన్ని కలిపి మిక్సీలో వేసి రుబ్బాలి. ఈ చట్నీ దోసెల్లోకి కూడా బాగుంటుంది. (వెల్లుల్లి ఇష్టం లేనివారు ఇంగువ వేసుకోవచ్చు. టమోటాలకు బదులుగా చింతపండు కూడా వాడవచ్చు).
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in