www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు (కొన్ని)

ద్రాక్షరసం

కావలసిన వస్తువులు:

ద్రాక్షపండ్లు

-

1 కిలో.

నీళ్లు

-

2 కప్పులు.

చక్కెర

-

తగినంత (సుమారుగా కప్పు).

బ్లాక్‌సాల్ట్

-

అర టీ స్పూను.

తయారు చేసే విధానం :

కడిగిన ద్రాక్షపండ్లని మిక్సీలోగానీ జ్యూసర్‌లోగానీ వేసి నీళ్లు, చక్కెర పోసి గ్రైండ్ చేయాలి. చివరలో సైంధవ లవణం కూడా కలపాలి. ఇష్టమైతే అరకిలో పచ్చద్రాక్ష, అరకిలో నల్లద్రాక్ష కూడా కలిపి జ్యూస్ చేసుకోవచ్చు.

[ వెనుకకు ]

మూలం:  ఆదివారం, ఈనాడు ఏప్రియల్ 24, 2005.

బ్రెడ్ పకోడి

కావలసిన వస్తువులు:

శనగపిండి

-

1 కప్పు.

జొన్నపిండి

-

1 కప్పు.

బఠాణీ పిండి

-

అర కప్పు.

మజ్జిగ

-

1 కప్పు.

బ్రెడ్

-

6 స్లైసులు.

ఉల్లి (తురుము)

-

3 పాయలు.

మిర్చి, అల్లం పేస్టు

-

2 టీ స్పూనులు.

కొత్తిమీర

-

1 కట్ట.

ఉప్పు

-

సరిపడినంత.

రిఫైండ్ ఆయిల్

-

సరిపడినంత.

తయారు చేసే విధానం :

గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా  చేసుకోవాలి. బ్రెడ్ స్లైసుల చివర్లు కట్‌చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండేయాలి. బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది ఆపై ఆయిల్‌లో దోరగా వేయించాలి. వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాట సాస్‌లతో కలిపి అతిధులకు అందించండి.

[ వెనుకకు ]

మూలం: ఆదివారం, వార్త  జనవరి 8, 2006.

బూందీ మిఠాయి

కావలసిన వస్తువులు:

శనగపిండి

-

500 గ్రా.

బెల్లం

-

600 గ్రా.

ఇలాచీ పొడి

-

10 గ్రా.

నెయ్యి

-

10 గ్రా.

మంచినూనె

-

సరిపడినంత.

తయారు చేసే విధానం :

శనగపిండిని సరిపడినన్ని నీళ్లతో ఒక మోస్తరు చిక్కదనం ఉండేలా కలిపి బూందీ జన్నాతో బూందీ తయారు చేసుకోవాలి. గిన్నెలో బెల్లం, సరిపడా నీళ్లు తీసుకొని ముదురు పాకం వచ్చేవరకు సన్నని సెగపై వేడి చేయాలి. తీగపాకం వచ్చాక బూందీ, ఇలాచీ పొడి వేసి చల్లారేవరకు బాగా కలియతిప్పాలి. ట్రే అడుగున నెయ్యి పూత పూసి దానిపై బూందీ మిశ్రమాన్ని వేసి చల్లార్చాలి.

[ వెనుకకు ]

చెగోడి

కావలసిన వస్తువులు:

బియ్యం పిండి

-

700 గ్రా.

మైదా

-

150 గ్రా.

పెసరపప్పు

-

150 గ్రా.

జీలకర్ర

-

10గ్రా.

ఉప్పు

-

సరిపడినంత.

డాల్డా

-

20 గ్రా.

రిఫైండ్ ఆయిల్

-

సరిపడినంత.

తయారు చేసే విధానం :

సరిపడినన్ని వేడినీళ్లలో మైదా, బియ్యంపిండి, డాల్డా, ఉప్పు వరుసగా వేసి మిశ్రమాన్ని బాగా కలిపి, జీలకర్ర వేసి కావలసిన సైజులో వుండలు చేసుకోవాలి. పెసరపప్పును అరగంటపాటు నీళ్లలో నానబెట్టి ఆపై నీటిని వడగట్టి పప్పును ఆరబెట్టాలి. బియ్యంపిండి ముద్దను తీసుకుని రోల్ చేసి దానికి పప్పును అద్ది రింగ్‌లా చుట్టి నూనెలో దోరగా వేయించాలి.

[ వెనుకకు ]

మూలం: ఆదివారం, వార్త  ఆగస్టు 1, 2004.

జొన్న మురుకులు (చక్రాలు)

కావలసిన వస్తువులు:

జొన్నపిండి

-

500 గ్రా.

శనగపిండి

-

250 గ్రా.

నువ్వులు

-

25 గ్రా.

వాము

-

5 గ్రా.

జీలకర్ర

-

10 గ్రా.

మిర్చి పొడి

-

25 గ్రా.

ఉప్పు

-

సరిపడినంత

రిఫైండ్ ఆయిల్

-

500 గ్రా.

తయారు చేసే విధానం :

గిన్నెలో జొన్నపిండి, శనగపిండి, నువ్వులు, జీలకర్ర, వాము, ఉప్పు, మిర్చిపొడి వరుసగా కలపాలి. కొద్దిగా రిఫైండ్ ఆయిల్‌ను బాగా కాచి  వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసి కలపాలి. నీటిని కలుపుతూ మురుకుల పిండిలా కలియదిప్పాలి. మురుకుల అచ్చుతో మురుకులు వేసి ఆయిల్‌లో దోరగా వేయించాలి.

మూలం: ఆదివారం, వార్త  సెప్టెంబర్ 12, 2004


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in