www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు (కొన్ని)

ాలక్ -  పకోడి

కావలసిన వస్తువులు:

పాలకూర

-

2 కట్టలు (సన్నగా తరగాలి).

శనగపిండి

-

1/4 కిలో.

బియ్యపు పిండి

-

2 టీ స్పూన్లు.

మంచినీళ్లు

-

తగినన్ని.

నూనె

-

తగినంత.

కొత్తిమీర తురుము

-

2 టీ స్పూన్లు.

పచ్చిమిర్చి

-

10 (సన్నగా కోయాలి).

అల్లం (కోరినది)

-

1 టీ స్పూను.

ఉప్పు

-

తగినంత.

జీలకర్ర పొడి

-

అర టీ స్పూను.

తయారుచేసే విధానం

ఓ గిన్నెలో పాలకూర తురుము వేసి అందులో కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, కారం, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి చేత్తో కొద్దిగా నలపాలి. తరువాత అందులోనే బియ్యపు పిండి, శనగపిండి వేసి కొద్దిగా నూనె వేడి చేసి పోసి తగినన్ని నీళ్లు పోసి పకోడిపిండిలా కలపాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి కాచి పిండిని చిన్న చిన్న ముద్దలుగా  పకోడీల్లా వేస్తూ దోరగా వేయించి తీయాలి.

[ వెనుకకు ]

సాగో బోండాస్

కావలసిన వస్తువులు:

పెద్ద సగ్గుబియ్యం

-

పావు కిలో.

బంగాళదుంపలు

-

రెండు.

వేరుశనగ గుళ్లు

-

100 గ్రా. (వేయించి బరకగా పొడి చేయాలి).

పచ్చిమిర్చి

-

4.

కొత్తిమీర

-

ఒక కప్పు (తరిగినది).

కొబ్బరి కోరు

-

చిన్నగిన్నెడు.

ఉప్పు

-

తగినంత.

కరివేపాకు

-

ఒక రెబ్బ.

జీలకర్ర

-

ఒక స్పూను.

పెరుగు

-

2 స్పూన్లు.

నూనె

-

వేయించడానికి సరిపడినంత.

తయారుచేసే విధానం

సగ్గుబియ్యం కడిగి నీళ్లలో రెండు గంటలు నానబెట్టాలి. వేరుశనగ గుళ్లు మూకుడులో నూనె వేయకుండా వేయించి చల్లారిన తరువాత మిక్సీలో పొడిగా చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడకనిచ్చి పొట్టుతీసి ముద్దగా చేయాలి నానిన సగ్గుబియ్యాన్ని నీరువార్చి బంగాళదుంప ముద్దలో వేయాలి. వేరుశనగపొడిని కూడా దానిలోనే వేయాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి కోరు, జీలకర్ర, పెరుగు, ఉప్పు చేర్చి అన్నీ పైన తయారుచేసుకున్న మిశ్రమంలో వేయాలి. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి కాగిన తరువాత అరచేతిలోకి ఆయిల్ రాసుకొని చిన్నముద్ద తీసుకుని నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసి ఏదయినా చట్నీతో కలిపి తింటే బాగుంటుంది.

[ వెనుకకు ]

కాలీఫ్లవర్‌ పకోడి

కావలసిన వస్తువులు:

కాలీఫ్లవర్

-

ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా విడదీయాలి).

అల్లం

-

చిన్నముక్క (సన్నగా తరగాలి).

కొత్తిమీర తురుము

-

1 టేబుల్‌ స్పూను.

ఉప్పు

-

తగినంత.

ఉల్లిపాయ

-

ఒకటి (సన్నగా తరగాలి).

పచ్చిమిర్చి

-

6 (సన్నగా తరగాలి).

గరం మసాలా

-

అర టీ స్పూను.

నూనె వేయించడానికి

-

సరిపడా.

శనగపిండి

-

పావు కిలో.

తయారుచేసే విధానం

శనగపిండిలో కొత్తిమీర తురుము, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా అన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కాకుండా గట్టిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాలీఫ్లవర్ ముక్కలకు పట్టించి ఓ అరగంటసేపు నాననివ్వాలి. స్టవ్‌ మీద బాణలి పెట్టి నూనె కాగాక కొద్దికొద్దిగా కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి వేయించి తీయాలి. (తక్కువ మంట మీద వేయించాలి) వేడివేడిగా కెచప్‌తో తింటే రుచిగా ఉంటాయి.

[ వెనుకకు ]

ఆలూ పకోడి

కావలసిన వస్తువులు:

బంగాళదుంపలు

-

పావు కిలో(ఉడికించాలి).

శనగపిండి

-

పావు కిలో.

నూనె

-

తగినంత.

ఉల్లిపాయలు

-

2 (సన్నగా తరగాలి).

కొత్తిమీర తురుము

-

కొద్దిగా.

కరివేపాకు తురుము

-

కొద్దిగా.

పచ్చిమిర్చి

-

ఆరు (సన్నగా తరగాలి).

అల్లం గుజ్జు

-

1 టీ స్పూను.

కారం

-

అర టీ స్పూను.

జీలకర్ర

-

అర టీ స్పూను.

ఉప్పు

-

తగినంత.

నీళ్లు

-

తగినన్ని.

తయారుచేసే విధానం

బంగాళదుంపలు తొక్క తీసి మెత్తగా చేసి జల్లించిన శనగపిండిలో వేసి కలపాలి. ఉల్లి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి, అల్లం తురుము, కారం, జీలకర్ర, ఉప్పు, అన్నీ వేసి కలపాలి. తరువాత కొద్దిగా కాచిన నూనె వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి గట్టి ముద్దలా చేసి కలపాలి. పిండిముద్దను కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని నూనెలో పకోడీల్లా వేసి దోరగా వేయించితీయాలి.

[ వెనుకకు ]

వెన్న ఉండలు (చల్ల ఉండలు, పాలకాయలు)

కావలసిన వస్తువులు:

బియ్యంపిండి

-

అర కిలో.

నూనె

-

అర లీటరు.

నువ్వులు

-

100 గ్రా.

వాము

-

2-3 చెంచాలు.

ఉప్పు

-

సరిపడినంత.

కారం

-

సరిపడినంత.

తయారుచేసే విధానం :

వాము నూరుకోవాలి. నీళ్ళు మరిగించి అందులో ఉప్పు కారాలు జీలకర్ర, వాము వెయ్యాలి. బియ్యప్పిండిలో వెన్న వేసి కలిపి దానిని మరుగుతున్న నీళ్ళలోపోసి ఉండలు కట్టకుండా కలియబెడుతుండాలి. పిండి ఉడికాక దింపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. నూనెకాచి ఆ ఉండల్ని అందులో వేయించుకోవాలి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in