|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు(కొన్ని)
కావలసిన వస్తువులు:
|
ముల్లంగి దుంపలు |
- |
4. |
|
కారం |
- |
2 టీ స్పూనులు. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
నూనె |
- |
వేయించడానికి సరిపడినంత. |
|
ధనియాలపొడి |
- |
1 టీ స్పూను. |
|
జీలకర్ర పొడి |
- |
1 టీ స్పూను. |
తయారు చేసే విధానం :
ముల్లంగి పొట్టు తీసి సన్నగా తరగాలి. తరువాత ఉప్పు వేసిన నీటిలో కడగాలి. కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక ముల్లంగి ముక్కలు వేసి తక్కువ మంటమీద వేయించాలి. ఉప్పు కూడా వేసి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, జీలకర్రపొడి, దనియాలపొడి వేసి దించాలి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
బంగాళదుంపలు |
- |
4. |
|
కారం |
- |
తగినంత. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
నూనె |
- |
వేయించడానికి సరిపడినంత. |
తయారు చేసే విధానం :
బంగాళదుంపలు పొట్టు తీసి సన్నగా తరగాలి. తరువాత నీటిలో కడగాలి. కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక బంగాళదుంపల ముక్కలు వేసి తక్కువ మంట మీద వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, ఉప్పు వేసి కలిపి దించాలి. కారం కాక పోయినా అందులో పప్పుల పొడుము కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి రుచిగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
దొండకాయలు |
- |
పావు కిలో. |
|
కారం |
- |
తగినంత. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
నూనె |
- |
వేయించడానికి సరిపడినంత. |
|
ఉల్లిపాయలు |
- |
2. |
తయారు చేసే విధానం :
దొండకాయలు నీటిలో కడిగి సన్నగా పొడవుగా కాని, చక్రాల్లా కాని తరగాలి. కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక దొండకాయ ముక్కలు వేసి తక్కువ మంటమీద వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, ఉప్పు వేసి కలిపి దించాలి. ఉల్లిపాయలు ఇష్టపడే వారు దొండకాయ ముక్కలు వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తరువాత కారం ఉప్పు కలుపుకోవాలి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
కాకరకాయలు |
- |
పావు కిలో. |
|
కారం |
- |
తగినంత. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
నూనె |
- |
వేయించడానికి సరిపడినంత. |
|
ఉల్లిపాయలు |
- |
3. |
తయారు చేసే విధానం :
కాకరకాయలు నీటిలో కడిగి సన్నగా తరగాలి. కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక కాకరకాయ ముక్కలు వేసి తక్కువ మంటమీద వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తరువాత నూనె వంపేసి కారం ఉప్పు కలుపుకోవాలి. లేదా కాకరకాయకు మధ్యలో గీత పెట్టి కాయ కాయగా అయినా వేయించ వచ్చు. అలా వేగిన తరువాత నూనె వంపేసి, చివరిలో ఉన్న కొంచెం నూనెలో కారం, ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. అవి ఆరిన తరువాత వాటి మధ్యలో ఆ కారాన్ని పెట్టికొని తినవచ్చు.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
క్యారెట్ |
- |
250గ్రా. |
|
పంచదార |
- |
350 గ్రా. |
|
నిమ్మరసం |
- |
1 చెంచా. |
|
నీళ్ళు |
- |
1కప్పు. |
తయారు చేసే విధానం :
క్యారెట్లను కడిగి, చెక్కుతీసుకుని తురుముకోవాలి. తురుముకు నీళ్ళు చేర్చి స్టౌమీద పెట్టి మెత్తగా ఉడికించాలి. ఉడికిన తురుముకు పంచదార చేర్చి నీళ్ళన్నీ ఇంకిపోయేవరకూ స్టౌమీద ఉంచాలి. చివరిగా నిమ్మరసం చేర్చి దీన్ని పొడిగా ఉన్న సీసాలోకి తీసుకోవాలి. ఇష్టమైన వారు చిటికెడు యాలకుల పొడి కూడా చేర్చుకోవచ్చు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in