www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు (కొన్ని)

సబ్జా షర్బత్

కావలసిన వస్తువులు:

సబ్జా

-

ఒక స్పూన్.

చక్కెర

-

తగినంత.

నీళ్ళు

-

ఒక గ్లాసు.

తయారు చేసే విధానం :

సబ్జాను ముందుగా వేడినీళ్ళలో పది నిమిషాలు నానబెట్టాలి. ఒక గ్లాసు నీళ్ళలో చక్కెర తగినంత వేసి బాగా కలిపి దానిలోకి నానబెట్టిన సబ్జాను వేసి బాగా కలపాలి. సబ్జా నీళ్ళు చల్లగా కావాలంటే తరువాత కొంచం సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

[ వెనుకకు ]

పుచ్చకాయ జ్యూస్

కావలసిన వస్తువులు:

పుచ్చకాయ

-

1.

పంచదార

-

150 గ్రా.

నిమ్మకాయ

-

1.

అల్లం

-

చిన్న ముక్క.

చాట్ మసాల

-

5 గ్రా.

తయారు చేసే విధానం :

ముందుగా పుచ్చకాయ చెక్కు తీసి, విత్తనాలు కూడా తీసివేయాలి. ఆ ముక్కలు, పంచదార నిమ్మ రసం, అల్లం ముక్కలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకొని తాగవచ్చు. దానికి చాట్‌ మసాలా కూడా కలుపుకోవచ్చు.

[ వెనుకకు ]

లస్సీ

కావలసిన వస్తువులు:

పెరుగు

-

ఒకటిన్నర కప్పులు.

ఐసుముక్కలు

-

ఆరు.

చల్లటినీళ్ళు

-

ఒకటిన్నర కప్పులు.

పంచదార

-

2 టీస్పూన్లు.

ఉప్పు

-

చిటికెడు

చెక్కరకేళీలు

-

3.

తయారు చేసే విధానం :

ఐసుముక్కల తప్ప మిగిలినవన్నీ మిక్సీలో వేసి బాగా నురుగువచ్చే వరకూ తిప్పాలి. పొడవాటి గ్లాసులో పోసి ఐసుముక్కలు వేసి అందించాలి. (పెరుగుకు సమాన పరిమాణంలో మామిడిరసం లేదా అరటిపండ్ల గుజ్జు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నిమ్మరసాలు జోడించి కూడా లస్సీ తయారుచేయవచ్చు. నిమ్మరసంతో చేసేటప్పుడు మాత్రం కప్పు పెరుగుకు టేబుల్‌స్పూను నిమ్మరసం వేస్తే సరిపోతుంది. పండ్లరసాలేమీ లేకుండా వెనీలా ఎసెన్స్, యాలకులపొడి లాంటివి వేసి కూడా లస్సీ తయారుచేయవచ్చు. కొన్ని చోట్ల అచ్చంగా పెరుగుతో కాకుండా సగం పాలు లేదా మీగడ వేసి కూడా లస్సీ చేస్తుంటారు. అసలు ఇవేవి కాకుండా సాదా లస్సీ  కావాలంటే ఉత్త పెరుగుతో పంచదార వేయకుండా కాస్త ఉప్పు, నీళ్ళు జీలకర్ర కలిపి గిలకొడితే సరిపోతుంది.)

[ వెనుకకు ]

పిస్తా మిల్క్ షేక్

కావలసిన వస్తువులు:

చిక్కటి మీగడ పాలు

-

ఒక లీటరు.

పంచదార పొడి

-

8 టీ స్పూన్లు.

పిస్తా పేస్టు

-

50 గ్రా.

పిస్తా కోవా

-

ఒక టేబుల్ స్పూను.

ఐస్ క్యూబ్స్

-

6.

యాలకుల పొడి

-

పావు టీస్పూను.

ఉప్పు

-

చిటికెడు.

తయారు చేసే విధానం :

ముందుగా పాలను కాచి చల్లార్చాలి. మిక్సీ జ్యూస్ జార్‌లో పాలు, పంచదార, పిస్తాపేస్టును, పిస్తా కోవా యాలుకుల పొడి, ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసి బాగా తిప్పాలి. కమ్మటి సువాసనలతో నురగలు కక్కుతూ పిస్తా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. తరువాత దీన్ని గాజు గ్లాసుల్లో పోస్తే ఆకర్షణీయమైన రంగుతో నోరూరిస్తుంది.

[ వెనుకకు ]

సోయా మిల్క్

కావలసిన వస్తువులు:

సోయా విత్తనాలు

-

500 గ్రా.

బేకింగ్ సోడా

-

1 టీ స్పూన్.

మంచి నీళ్లు:

-

2 లీటర్లు.

తయారు చేసే విధానం :

సోయా విత్తనాలను పావు గంటసేపు నీటిలో నానబెట్టండి. ఈ నీళ్లను వార్చండి. పిదప మళ్ళీ నీళ్లు, బేకింగ్ పౌడర్ కలిపి పది నిమిషాలపాటు ఉడికించి ఒకటికి రెండుసార్లు విత్తనాలను కడగండి. ఈ విత్తనాల్లో రెండు లీటర్ల నీళ్లు పోసి గ్రైండర్‌లో మెత్తగా రుబ్బండి. ఈ పాలను పలుచని వస్త్రంలో వడగట్టండి. ఈ పాలను బాగా మరిగించండి. కాచేటప్పుడు అడుగు అంటకుండా గరిటెతో కలుపుతూ ఉంచండి. సోయా మిల్క్ తయారు. సోయా పాలను రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో కాస్త పంచదార కలుపుకొని త్రాగవచ్చు. అలాగే కోకో పొడి, వెనీలా ఎసెన్స్, రోజ్ ఎసెన్స్‌లాంటివి కలిపి ఫ్లేవర్డ్ మిల్క్‌గా చేసుకుని చల్లబరచి తాగవచ్చు.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in