|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
|
బియ్యం లేదా పలావు బియ్యం |
- |
అరకిలో. |
|
కొబ్బరికాయ |
- |
ఒకటి. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
ఎండుమిర్చి |
- |
నాలుగు. |
|
పచ్చిమిర్చి |
- |
నాలుగు. |
|
మినపప్పు |
- |
రెండు స్పూన్లు. |
|
శనగపప్పు |
- |
రెండు స్పూన్లు. |
|
ఆవాలు |
- |
ఒక స్పూను. |
|
కరివేపాకు |
- |
రెండు రెమ్మలు. |
|
నెయ్యి లేదా రిపైన్డ్ ఆయిల్ |
- |
అర కప్పు. |
|
జీడిపప్పు |
- |
కొద్దిగా. |
|
కిస్‌మిస్ |
- |
కొద్దిగా. |
తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం శుభ్రం చేసుకుని అన్నం వండాలి. (అన్నం పొడిపొడిగా ఉండాలి) కొబ్బరి తురిమి ఉంచాలి. ఓ వెడల్పాటి పళ్లెంలో అన్నం వేసి, సగం నూనె పోసి కలపాలి. స్టవ్ మీద కళాయి పెట్టి మిగతా సగం నూనె పోసి కాగిన తరువాత పోపు వేసి అవి వేగిన తరవాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించాలి. వేగిన పోపును అన్నంలో కలపాలి. తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు కిస్‌మిస్ కూడా అన్నంలో కలపాలి. చివరగా ఉప్పు, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి ఓ గంట తరువాత వడ్డించండి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
మినపప్పు |
- |
1 కప్పు. |
|
మినపొట్టు |
- |
4 కప్పులు. |
|
ఇంగువ |
- |
కొద్దిగా.(ఇష్టమైతేనే). |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
పచ్చిమిరపకాయలు |
- |
పది. |
తయారు చేసే విధానం :
ముందుగా మినపప్పుని మెత్తగా రుబ్బాలి. తరవాత పొట్టు, ఉప్పు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు పోసి రుబ్బాలి(మరీ మెత్తగా వద్దు). మినప వడియాల మాదిరిగానే ప్లాస్టిక్ కవర్‌మీద సరిపడా సైజులో పెట్టుకోవాలి. నూనెలో వేయించి తీస్తే కరకరలాడుతుంటాయి. వీటిని వేడి వేడి అన్నంలో నేతిలో కలుపుకుని తింటే బాగుంటాయి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
బూడిదగుమ్మడికాయ(చిన్నది) |
- |
ఒకటి. |
|
పొట్టుమినపప్పు |
- |
అరకిలో. |
|
పచ్చిమిర్చి |
- |
50 గ్రా. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
ఇంగువపొడి |
- |
1 టీస్పూను(ఇష్టమైతేనే). |
తయారు చేసే విధానం :
బూడిదగుమ్మడికాయను బాగా కడిగి రాత్రిపూటే చిన్న చిన్న ముక్కలుగాకోసి కొంచెం ఉప్పు వేసి ఓ బట్టలో మూటగట్టి దనిమీద బరువైన రాయి లాంటిది పెట్టాలి. ఇలా చేయడంవల్ల ముక్కల్లోని నీరంతా కారిపోతుంది.
మినపప్పు కూడా రాత్రే నానబెట్టాలి.
ఉదయాన్నే మినప్పప్పు పొట్టు తీసి నీళ్లు తక్కువగా పోసి మెత్తగా రుబ్బాలి. మిర్చి, ఉప్పు, ఇంగువ మెత్తగా నూరి మినప్పిండిలో వేసి కలపాలి. తరవాత బూడిదగుమ్మడి ముక్కలు కూడా వేసి బాగా కలిపి కావలసిన సైజులో ప్లాస్టిక్ కవర్‌మీద పెట్టుకోవాలి. బాగా ఎండిన తరువాతవీటిని అన్నంతోపాటు తింటే బాగుంటాయి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
సగ్గుబియ్యం |
- |
1 కప్పు. |
|
మంచినీళ్లు |
- |
4 కప్పులు. |
|
పచ్చిమిర్చి |
- |
4. |
|
జీలకర్ర |
- |
కొద్దిగా. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
నువ్వులపప్పు |
- |
పావుకప్పు. |
తయారు చేసే విధానం :
మందపాటి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌మీదపెట్టాలి. బాగా మరిగిన తరవాత సగ్గుబియ్యం పోసి మంట తగ్గించాలి.
మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఓ గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయినట్లుగా రంగులేకుండా అయితే అవి ఉడికినట్లే. తరవాత పాత్రను కిందకి దించి దంచిన పచ్చిమిర్చి, ఉప్పుకలపాలి. జీలకర్ర, నువ్వులు కూడా వేయాలి. కాస్త చిక్కగా గంజిలా ఉన్న దీన్ని చల్లారిన తరవాత ప్లాస్టిక్ కవర్‌మీద కావలసిన సైజులో పెట్టుకోవాలి. ఇవి రెండురోజుల్లో ఎండిపోతాయి. వేయించిన సగ్గుబియ్యం వడియాల్ని స్నాక్స్‌లా కూడా తినవచ్చు.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
బియ్యపిండి |
- |
2 కప్పులు. |
|
మంచినీళ్లు |
- |
4 కప్పులు. |
|
పచ్చిమిర్చి |
- |
8. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
జీలకర్ర |
- |
కొద్దిగా. |
|
నువ్వులపప్పు |
- |
4 టీస్పూన్లు. |
తయారు చేసే విధానం :
మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లుపోసి, స్టవ్‌మీద పెట్టాలి. బియ్యప్పిండిలో రెండు కప్పుల చల్లటి నీళ్లు పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద నీళ్లు బాగా మరిగిన తరువాత బియ్యప్పిండిలో నీళ్లను పోసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. పిండి ఉడికిన తరువాత మెత్తగా దంచిన పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర మిశ్రమాన్ని వేయాలి. నువ్వులపప్పు కూడా వేసి కలపాలి. చల్లారిన తరవాత జంతికల గొట్టంలో ఈ పిండి ఉంచి ప్లాస్టిక్ కవర్‌మీద జంతికల మాదిరిగా కావలసిన సైజులో వత్తి ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తరవాత జాగ్రత్తగా విరిగిపోకుండా డబ్బాలో భద్రపరచాలి. ఇదే పిండితో చిన్న చిన్న వడియాలు కూడా పెట్టుకోవచ్చు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in