telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

కాకరకాయ కూర

కావలసిన వస్తువులు:

కాకరకాయలు - 1 కిలో
నూనె - 150 గ్రా||
మినపప్పు - 25 గ్రా||
శనగపప్పు - 25 గ్రా||
ఎండుమిర్చి - 25
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:

కాకరకాయ గర్భాన కాస్త లోతుగానూ, విడిగానూ గాట్లు పెట్టి వుడికించి వార్చి వుంచాలి. ఒట్టిమూకుట్లో మినపప్పూ, శనగప్ప్పూ, ఎండుమిర్చి వేయించి సరిపడా ఉప్పు, కారం కొట్టాలి. కూర్చిన కాకరకాయల్లో నీరులేకుండా చేసి, ఆ గాట్లలో ఈ కారం కూర్చాలి. కారం రాలిపోకుండా కాయలకి దారాలు కట్టుకోవాలి. నూనె కాచి, ఈ కారం కూర్చిన కాయల్ని అందులో వేసి వేయించి తీసుకోవాలి. తినేటప్పుడు కట్టిన దారాల్ని తీసివేయాలి.


[ వెనుకకు ]

బీరకాయ కూర

కావలసిన వస్తువులు:

బీరకాయలు - 1 కిలో
నూనె - 25 గ్రా||
ఎండుమిర్చి - 4
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:

బీరకాయలమీద చెక్కును తీసేసి కాయని ముక్కలుగా తరిగి ఉప్పురాసి పెట్టాలి. నూనెకాచి పోపుగింజలు వేయించి, ఎండుమిర్చీ తుంపి ముక్కలు వేసి బీరకాయముక్కల్ని పోపులో వెయ్యాలి. మూతపెట్టి మగ్గనిచ్చి దింపుకోవాలి.


[ వెనుకకు ]

చిక్కుడు వేపుడు

కావలసిన వస్తువులు:

పెద్దగింజలుండే చిక్కుళ్ళు - 250గ్రా||
నూనె - 50గ్రా||
కారం - అరచెంచాడు
లవంగపొడి - చిటికెడు
కర్వేపాకు - 2 రెబ్బలు
ఎండుమిర్చి - 1
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:

చిక్కుళ్ళు వుడకేసి, ఒక పొంగురాగానే దింపి వార్చేయాలి. నూనె మరిగించి, వార్చి ఉంచిన చిక్కుళ్ళు, ఎండుమిర్చీ, కర్వేపాకు, ఉప్పూ వేసి బాగా వేయించి, లవంగాపొడి చల్లి బాగా కలియబెట్టి దింపుకోవాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: