telugudanam.co.in

      telugudanam.co.in

   

పన్నీర్‌బ్రెడ్‌

కావలసిన వస్తువులు:

శాండ్‌విచ్ బ్రెడ్ ముక్కలు - ఎనిమిది
పన్నీర్ - 100గ్రాములు
ఉల్లిపాయ - ఒకటి
కారం - టీస్పూను
అల్లంవెల్లుల్లి - అరటీస్పూను
సెనగపిండి - 100గ్రాములు
ఉప్పు - తగినంత
మంచినీళ్లు - కప్పు
నూనె - వేయించడానికి సరిపడా

తయారు చేసే విధానం:

ఉల్లిపాయ సన్నగా తరగాలి. పన్నీర్‌ సన్నగా తురమాలి. బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కలు వేయించాలి. తరువాత పన్నీర్, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. బ్రెడ్ ముక్కల అంచులు తీసేసీ వీటిని త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి. విడిగా చిన్న గిన్నెలో చిటికెడు ఉప్పు, కొద్దిగా బియ్యపిండి, తగిన నీళ్లు పోసి గట్టి పేస్టులా చేసి పన్నీర్ ముక్కల మిశ్రమంలో కలపాలి. కత్తిరించిన ఓ బ్రెడ్‌ముక్కను తీసుకుని దాని మీద మిశ్రమాన్ని పలుచగా పూసి పైన మరో బ్రెడ్ ముక్క పెట్టి శాండ్‌విచ్‌లా తయారుచేయాలి. ఇలా మొత్తం బ్రెడ్‌ముక్కలని చేసుకుని పక్కన పెట్టాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె కాగాక బ్రెడ్ ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీయాలి. టమాటో సాస్ లేదా చింతకాయ పచ్చడితో తింటే ఇవి బాగుంటాయి. (పన్నీర్ ఇష్టం లేని వాళ్లు కొబ్బరి, వేరుసెనగపప్పు కలిపి చేసిన పచ్చడిని బ్రెడ్‌ముక్కల మధ్య ఉంచవచ్చు.)


[ వెనుకకు ]

రైస్ క్రొకెట్సు

కావలసిన వస్తువులు:

అన్నం - రెండు కప్పులు
మైదాపిండి - అరకప్పు
బీన్స్ - 50గ్రాములు
కాలీఫ్లవర్ - ఒక కప్పు(చిన్నపువ్వులుగా తెంపాలి)
పచ్చిబఠానీలు - 50గ్రాములు
క్యారెట్ - ఒకటి(చిన్న ముక్కలుగా తరిగినది)
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - కొంచెం

వైట్‌సాస్ తయారీకి కావలసినవి:

కార్న్‌ఫ్లోర్ - 2టీస్పూన్లు
మిరియాల పొడి - అర టీస్పూను
ఉప్పు - తగినంత
పాలు - ఒక గ్లాసు
వెన్న - కొంచెం

తయారు చేసే విధానం:

ముందుగా సాస్ తయారు చేసుకోవడానికి మూకుడులో వెన్నను వేడి చేసి అందులో పాలు, కార్న్‌ఫ్లోర్ కలిపి మరుగుతుండగా ఉప్పు, మిరియాల పొడి చేర్చి కలిపి ఉడికిన తరువాత పక్కన పెట్టుకోవాలి. కూరగాయలు చిన్నముక్కలుగా తరిగి ఉడికించి నీరువార్చి ఉంచుకోవాలి. వీటిని వైట్‌సాస్‌తో కలిపి సన్నని మంట మీద 5 నిముషాలు ఉడికించి చల్లార్చి పక్కన ఉంచుకోవాలి.

అన్నంలో మైదాపిండిని కలిపి మెత్తని ముద్దగా చేసి అందులో తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి వీటికి కొంచెం నీటిని చేర్చి ముద్దగా చేసుకోవాలి. అరటి ఆకుపై నూనెను రాసి మైదాముద్దను కొంచెం తీసుకుని వెడల్పుగా వత్తి మధ్యలో ఉడికించి పెట్టుకున్న కూరగాయల మిశ్రమాన్ని ఉంచి నిలువుగా మడిచి పొడువుగా వత్తండి. లేదా వడ ఆకారంలోనూ చేసుకోవచ్చు. తరువాత వీటిని నూనెలో ఎర్రగా వేయించి ఏదైనా సాస్‌తో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.[ వెనుకకు ]

బట్టర్ స్కాచ్ ఫ్రూట్స్ విత్ జెల్లీ

కావలసిన వస్తువులు:

రాస్‌బెర్రీ జెల్లీ - ఒక ఫ్యాకెట్
పాలు - మూడున్నర కప్పులు
నిమ్మరసం - ఒక టీ స్పూన్
వెన్న - ఒక టీ స్పూన్
బ్రౌన్‌షుగర్ - ఒక టేబుల్ స్పూన్
మిక్స్‌డ్ ఫ్రూట్స్ - ముక్కలు రెండు కప్పులు
బాదం పప్పులు - నాలుగైదు

తయారు చేసే విధానం:

వేడిపాలలో జెల్లీ వేసి బాగా కరిగిపోయేదాకా తిప్పండి. అది చల్లారిన తరువాత గుండ్రని గిన్నెలో పోసి నాలుగైదు గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. మరో గిన్నెలో ఆపిల్ ముక్కలు వేసి కొద్దిగా నిమ్మరసం చల్లి బాగా కలపండి. దీని వల్ల నల్లబడకుండా ఉంటాయి. నానబెట్టిన బాదం పప్పులను పొడవైన ముక్కలుగా కోసి పక్కనుంచుకోండి. తినేముందు వెన్నని వేడి చేసి అందులో బ్రౌన్‌షుగర్ వేసి తిప్పండి. అది కరిగిన తరువాత అందులో తాజా పళ్లముక్కలు, నిమ్మరసం కలిపి ఉన్న ఆపిల్ ముక్కలు, బాదం ముక్కలు వేసి బాగా కలపండి. చివరగా ఫ్రిజ్‌లో నుండి జెల్లీ ఉన్న గిన్నె తిసి చాకుతో అంచులని పైకిలేపి ఒక్కక్షణం గోరువెచ్చని నీటిలో ఉంచి తీసేయండి. తరువాత దానిని తడి ఫ్లేటులో నునుపుగా ఉన్న భాగం పైకివచ్చేలా అమర్చండి. దానిమీద మీ సృజనాత్మకతని ఉపయోగించి పళ్లముక్కలని, కస్టర్డ్‌ని చక్కగా పొరలు పొరలుగా వరసగా సర్దండి. కనువిందుతో పాటు పసందుగా ఉన్న డిజర్ట్ ఆస్వాదించండి.


[ వెనుకకు ]

సోయాబాల్స్

కావలసిన వస్తువులు:

మీల్ మేకర్(సోయా బాల్స్ ) ఉడికించినవి - ఒక కప్పు
కార్న్‌ఫ్లోర్ - ఒక టేబుల్ స్పూన్‌
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూన్‌.
గరం మసాలా - ఒక టీ స్పూన్‌.
సోయాసాస్ - రెండు టీ స్పూన్లు.
మిర్చి - రెండు.
అల్లం, వెల్లుల్లి ముక్కలు - తగినంత
నూనె - వేయించడానికి తగినంత
పుదీన, జీడిపప్పు, కొత్తిమీర - తగినంత

తయారు చేసే విధానం:

మూకుడులో నూనె కాగిన తరువాత చీల్చిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. అందులోనే పుదీనా కూడా వేసి కొద్దిగ వేగిన తరువాత మీల్‌ మేకరు వేయాలి. ఆ తరువాత సోయాసాస్‌ కూడా వేసి బాగా కలిపి చివరిగా ఒక స్పూన్‌ నీళ్లు వేసి తిప్పిదించేయాలి. తినబోయేముందు వేగించిన జీడిపప్పు, కొత్తిమీర, గుండ్రంగా తరిగిన టమాట ముక్కలు అందంగా సర్ది వడ్డించండి. వీటికి కాబేజీ తరుగు, కీరా ముక్కలు, చిప్స్ కూడా జత చేస్తే ఇంకారుచిగా ఉంటుంది. పోషకాలకి కొదవ ఉండదు.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: