telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

స్టఫ్‌డ్ రోల్స్

కావలసిన వస్తువులు:

ప్రెంచ్‌రోల్ - 1.
ఉడికించిన బఠాణీ - 2 కప్పులు.
ఉడికించిన పెసర మొలకలు - 1 కప్పు.
సన్నగా తరిగిన అల్లం - 1 చెంచా.
సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు - 2 చెంచాలు.
చాట్ మసాలా - 2 చెంచాలు.
తరిగిన కొత్తిమీర - 2 గరిటెలు.
తరిగిన ఉల్లిగడ్డ - 1.
ఉప్పు - సరిపడినంత.
వెన్న - వేయించడానికి సరిపడినంత.

తయారు చేసే విధానం:

ప్రెంచ్‌రోల్‌ను ఐదు ముక్కలుగా కట్‌చేసుకోవాలి. ఒక్కో భాగం ఓ కప్పులా ఉంటుంది. నింపడానికి వీలుగా అడుగు భాగం ఉండేలా చేసుకోవాలి. ఉడికించిన బఠాణీలు కాస్త అటు ఇటుగా చితపాలి. అందులో అల్లం, మొలకగింజలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, చాట్ మసాలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కప్పుల్లాంటి ఒక్కో ప్రెంచ్‌రోల్‌లో నింపుకోవాలి. పైన కాస్త వెన్నను రాయాలి. వీటిని ఓవెన్‌లో పెట్టి 5-10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. తరిగిన ఉల్లిముక్కలతో వేడి వేడిగా అందించండి.


[ వెనుకకు ]

స్టాబెర్రీ డిలైట్‌

కావలసిన వస్తువులు:

ప్లెయిన్‌ కేక్‌ - ఒకటి.
స్ట్రాబెర్రీలు - గుప్పెడు (నిలువుగా రెండుముక్కల్లా కోసుకోవాలి).
వెనీలా ఐస్‌క్రీం - 500 గ్రాములు.
జిలిటెన్‌ - రెండు టీ స్పూన్లు ( గోరువెచ్చని నీటిలో కలపాలి).
పాలు - చిన్న కప్పు (చిక్కగా మరిగించినవి).

తయారు చేసే విధానం:

ముందుగా కేక్‌ను సన్నగా మీకు కావలసిన స్లైస్‌లుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. కేక్, పాలు, జిలిటెన్‌, వెనీలా ఐస్‌క్రీమ్‌లను చిక్కటి నురుగు వచ్చేదాకా మిక్సీలో వేయాలి. అప్పుడు ఈ మిశ్రమాన్ని పోసి దానిపై మిగిలిన స్ట్రాబెర్రీ ముక్కలను అలంకరించి సర్వ్ చేయాలి.


[ వెనుకకు ]

హనీడేట్‌

కావలసిన వస్తువులు:

మైదాపిండి - పావుకిలో.
ఖర్జూరాలు - పావుకిలో.
తేనె - 100 గ్రాములు.
నూనె - వేయించడానకి సరిపడా.

తయారు చేసే విధానం:

మైదాపిండిని చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. ఖర్జూరాల్లోని గింజలు తొలగించి మిక్సీలో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నునే వేడి చేయండి. కలిపి పెట్టుకున్న మైదాపిండిని చతురస్త్రాకారంలో కాస్త మందంగా వత్తాలి. దీనిపై సరిపడా ఖర్జూరాల ముద్దను తీసుకుని ఒక పక్కన మందంగా వేయాలి. మిగతా భాగంతో ఈ మిశ్రమాన్ని మూసేయాలి. వేలితో నొక్కి అతికించాలి. ఇప్పుడది కజ్జికాయలాగా తయారౌతుంది. ఇలా వరసగా తయారుచేసుకున్న వాటన్నిటినీ కనీసం పదినిముషాల పాటు ఆరనిచ్చి, స్లైసుల్లా కోసి నూనెలో వేయించాలి. ఆరకుంటే నూనెలో వేయగానే స్లైసు విరిగి మిశ్రమం నూనెలో కలిసిపోతుంది. ఇలా వేయించిన వాటిని తేనెలో ముంచి తీయాలి. తీపి అంతగా ఇష్టం లేనివారు వేయించిన స్లైసులపై తేనెను కాస్తగా చిలకరించుకుంటే సరిపోతుంది.


[ వెనుకకు ]

కైమా పప్స్

కావలసిన వస్తువులు:

కైమా - పావు కిలో.
ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి) - పావు కిలో.
పచ్చి మిర్చి (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి) - 5.
అల్లం - చిన్నముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4 (అల్లం, వెల్లుల్లిని ముద్దలా నూరుకోవాలి).
కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూను.
ధనియాల పొడి - 1 టీస్పూను.
పసుపు - చిటికెడు.
గరం మసాల పొడి - అర టీస్పూను.
కోడి గుడ్లు - 3 (ఉడికించుకుని సగానికి కోసి ఉంచాలి).
గోధుమ పిండి - 200 గ్రాములు.
ఉప్పు - తగినంత.
నూనె - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:

కైమాకు కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు చేర్చి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. గోధుమ, మైదా పిండికి కొద్దిగా ఉప్పు, నీళ్ళు చేర్చి చపాతీ పిండిలా కలిపి విడిగా పెట్టుకోవాలి. బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, కరివేపాకును వేసి దోరగా వేయించాలి. వీటన్నింటినీ ఉడికించిన కైమా ముద్దకు చేర్చి బాగా కలపాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండల్లా చేసుకొని, చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. దీన్ని చివర్లు కత్తితో కోస్తే చతురస్రాకారం అవుతుంది. ఇందులో ముందే తయారుచేసి పెట్టుకున్న కూరను మూడు టేబుల్ స్పూన్లను వేసి చపాతీ అంతా రాయాలి. కోసి పెట్టుకున్న కోసి పెట్టుకున్న కోడిగుడ్డును మధ్యలో పెట్టాలి. ఇప్పుడు మరో చపాతీని ఇదే పరిమాణంలో ఒత్తి దీనిపై ఉంచి నాలుగు చివర్లు కలుపుతూ అతికించాలి. కొద్దిగా నూనె రాస్తే సులువుగా అతుక్కుంటుంది. వీటిని నూనెలో వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే కైమా పప్స్ సిద్దం. వీటిని నేరుగానే తినవచ్చు, లేదంటే పుదీనా, కొత్తిమీర చట్నీతో తింటే ఆ రుచే వేరు.


[ వెనుకకు ]

బాదంపాక్‌

కావలసిన వస్తువులు:

బాదంపప్పులు - అరకిలో.
నెయ్యి - 300 గ్రాములు.
పంచదార - 400 గ్రాములు.
నీళ్లు - సరిపడినంత.
యాలకుల పొడి - చిటికెడు.
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్.
ఉప్పు - 3/4 కిలో.

తయారు చేసే విధానం:

బాదంపప్పును ఉడికించి చల్లారాక వాటి పొట్టును తీసేయాలి. (చేతితో రుద్దితే పొట్టు సులువుగా వచ్చేస్తుంది.) వీటికి తగినన్ని నీళ్లు చేర్చి మెత్తని పేస్టులా చేయాలి. తర్వాత బాణలిలో నెయ్యి కరిగించి ఈ బాదంపప్పు ముద్ద వేసి లేతబంగారు వర్ణం వచ్చేవరకు సన్న సెగపై వేయించాలి. ఇప్పుడు మరో బాణలిలో కొద్దిగా నీరు పోసి పంచదార పాకం పట్టాలి. (ఈ పాకం చేత్తో ముట్టుకుంటే ఉండలా రావాలి). ఈ పాకానికి ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న బాదంపేస్టు, యాలకుల పొడి చేర్చి బాగా కలపాలి. సన్నని సెగపై ఉడుకుతు మిశ్రమం దగ్గర పడేదాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత నెయ్యి రాసిన ప్లేటులో పోసి చల్లారిన తర్వాత ముక్కల్లా కోసుకోవాలి. నోరూరించే బాదంపాక్‌ రెడీ.


[ వెనుకకు ]

ఎర్ర క్యాప్సికం దోసె

కావలసిన పదార్థాలు :

ఎర్ర క్యాప్సికం (సన్నగా తరగినవి) - ఒకటి.
వెన్న - అరకప్పు.
కోడిగుడ్లు ( తెల్లసొన మాత్రమే తీసుకోవాలి) - రెండు.
మొక్కజొన్నపిండి - పావుకప్పు.
మిరియాల పొడి - అరస్పూను.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు (సన్నగా తరగినవి) - ఒకటి.
ఉల్లికాడలు (వీటిని పొడుగ్గా నిలువుగా కోసుకోవాలి) - ఎనిమిది.

తయారు చేసే విధానం:

క్యాప్సికం ముక్కలు, కొద్దిగా వెన్న, కోడిగుడ్ల సొన, మొక్కజొన్న పిండి, మిరియాలు పొడి, ఉల్లిపాయల తరుగు, కొద్దిగా ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని మిశ్రమం చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వెన్నను పెనం పై వేసి కరిగించి, ఈ మిశ్రమంతో దళసరిగా అట్టులా వేసుకోవాలి. బంగారు రంగు వచ్చేదాకా పెనం పై రెండువైపులా కాల్చాలి. వేడిగా ఉన్నప్పుడే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపొర కాడలు మధ్యలో ఉంచి చుట్టేయాలి. ఆ వేడికి కాస్త మగ్గిన ఉల్లికాడలు చాలా రుచిగా ఉంటాయి. సాస్‌, పొదీనా చట్నీతో కలిపి సర్వ్‌ చేసుకోవాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: