telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

పేపర్ దోసె

కావలసిన వస్తువులు:

‌‌మినపప్పు - 1/2 కప్పు.
‌బియ్యం - 4 కప్పులు.
‌ఉప్పు - ‌తగినంత.
జీలకర్ర - 1 స్పూన్‌.
నూనె - ‌1/2 కప్పు.

తయారు చేసే విధానం:

మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా ఆరుగంటలపాటు నానబెట్టాలి.తరువాత విడిగానే మెత్తగా రుబ్బుకుని మరీ పలుచగా కాకుండా చేసుకుని రెండు మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా ఉంచాలి. జీలకర్రను ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి వేడి పెనంపై పేపర్‌లా పలుచగా ఉండేలా దోసెలను వేసుకుని సన్నని సెగపై బంగారు రంగు వచ్చేవరకు కాల్చి చట్నీ, సాంబార్‌తో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.


[ వెనుకకు ]

‌‌పుల్లట్టు

కావలసిన వస్తువులు:

‌‌బియ్యపు పిండి - 250 గ్రా.
‌మైదా - 100 గ్రా.
‌‌గడ్డపెరుగు - ‌100 గ్రా.
‌జీలకర్ర - 1 టీ స్పూన్‌.
‌పచ్చిమిరపకాయలు - ‌3.
ఉల్లిపాయ - 1.
‌వేరుశనగపప్పు - 50 గ్రా.
‌‌నెయ్యి - ‌అర కప్పు.
‌కరివేపాకు - 2 రెబ్బలు.
‌కొత్తిమిర - ‌2 టీ స్పూన్‌.

తయారు చేసే విధానం:

గడ్డపెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి, మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారు నాలుగైదు గంటలపాటు పులవనిచ్చి ఆ తరువాతే అట్టు పోసుకోవాలి. అట్ల పెనం మీద కాని గుంటల పెనం మీద కాని దీనిని కావలసిన పరిమాణములో పోసుకొని నెయ్యితో కాల్చుకోవాలి. పిండి ఎంత పులిస్తే అంత రుచిగా ఉంటుంది.


[ వెనుకకు ]

వడ

కావలసిన వస్తువులు:

‌‌మినప్పప్పు - 200 గ్రా.
‌పచ్చిమిర్చి - 6.
‌‌అల్లం - ‌ఒక ముక్క.
కరివేపాకు - 1 రెబ్బ.
ఉప్పు - ‌తగినంత.
నూనె - ‌వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:

ముందుగా మినప్పప్పును శుభ్రం చేసి నాలుగు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత వడగట్టి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా కాటుకలా గ్రైండ్ చేసుకోవాలి. ఉన్నా తడి సరిపోతుంది. నీళ్లు పోస్తే పిండి పలుచబడుతుంది. చివర్లో తగినంత ఉప్పు, సనంగా తరిగిన కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసి పిండిని చిన్న ముద్దలుగా తీసుకుని తడి చేత్తో ప్లాస్టిక్ కాగితంపైన లేదా అరిటాకుపైన వేదలుపుగా వత్తుకుని మధ్యలో వేలితోనే చిల్లు పెట్టి నూనె లో వేసి బంగారు రంగు వచ్చేవరకు నిదానంగా వేయించి తీసేయాలి. వీటిని కొబ్బరి చట్నీ, సాంబార్ తో వడ్డించండి.


[ వెనుకకు ]

‌‌పులగం

కావలసిన వస్తువులు:

‌‌బియ్యం - 250 గ్రా.
‌పెసరపప్పు - 100 గ్రా.
‌‌పచ్చిమిర్చి - ‌‌6.
ఆవాలు - 1/4 గ్రా.
జీలకర్ర - 1/4 గ్రా.
అల్లం - చిన్న ముక్క.
కొత్తిమిర - 1/2 కట్ట.
జీడిపప్పు - 10.
మిరియాలు - 8.
నెయ్యి - 4 టీ స్పూన్స్.
నూనె - 2 టీ స్పూన్స్.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

బియ్యం, పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి అరగంట నీటిలో నానబెట్టాలి. వెడల్పటి గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వరసగా వేసి దోరగా వేగాక సరిపడినన్ని నీళు పోసి మరిగించాలి. తర్వాత బియ్యం, పప్పు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి.రంగు కావాలంటే పావు టీస్పూను పసుపు వేసుకోవచ్చు. అడుగంటకుండా కలుపుతూ మొత్తం ఉడికాక కొత్తిమిర కలిపి దింపేయాలి.


[ వెనుకకు ]

‌‌జీరా రైస్‌

కావలసిన వస్తువులు:

‌‌అన్నము - అర కిలో.
‌జీలకర్ర - మూడు టీ స్పూన్లు.
‌‌పచ్చి మిర్చి - ‌మూడు.
ఉప్పు. - రుచికి తగినంత.
నూనె - ఐదు లేక ఆరు టీ స్పూన్లు.
జీడి పప్పు మరియు బఠాణీ - రుచికి కావాలనుకుంటే వేసుకోవచ్చు.

తయారు చేసే విధానం:

ముందుగా అన్నం వండుకొని చల్లార బెట్టాలి . ఒక బాణీ తీసుకుని అందులో ఐదు లేక ఆరు టీ స్పూన్లు వేసి కాగనివ్వాలి. అందులో మూడు టీస్పూన్ల జీలక్ర్ర వేసి వేగ నివ్వాలి. తరువాత తరిగిం అపచ్చిమిర్చి వేసి వేగ నివ్వాలి. రుచికి కావాలి అనుకుంటే జీడిపప్పు మరియు ఉడికించిన బఠాణి వేసుకోవచ్చు. వాటిని కూడా వేగనిచ్చి, ఇప్పుడు అన్నం అందులో వేసుకోవాలి. అన్ని బాగా కలిసే లాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక్క నిమిషం గ్యాసు మీద ఉంచి దించుకోవడమే. చూశారా జీరా రైస్‌ చేయడం చాలా సులువు కదా...


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: