|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్..
|
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
బఠాణీతో వెరైటీలు

పెద్దసైజు బంగాళదుంపలు - నాలుగు
నూనె లేదా నెయ్యి - వేయించడానికి సరిపడినంత
ఉడకబెట్టిన బఠాణీలు - రెండు కప్పులు ( మెత్తగా రుబ్బినవి )
సన్నగా తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
పచ్చిమిరపకాయలు - రెండు ( సన్నగా తరగాలి )
జీలకర్ర - ఒక చెంచా
నూనె - ఒక చెంచా
గరం మసాలా - సగంచెంచా
ఉప్పు - తగినంత
తయారుచేసేవిధానం:
మొదట బంగాళదుంపల పొట్టు తీసి అడ్డంగా రెండు సమభాగాలుగా కట్‌చేసు కోవాలి. ఈ ముక్కల మధ్యలోని పదార్థాన్ని తీదేసి గిన్నెలా తయారు చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఈ బంగాళదుంప గిన్నెలు ఉడికి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత తీసి పక్కనపెట్టుకోవాలి.
దీంట్లో నింపడానికి
మొదట ఒక పాన్‌లో నూనె వేడిచేసి జీలక్ర్ర వేసి తరువాత బఠాణీలు, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఉడికించి చల్లార్చాలి. తరువాత దీనిని వేపిన బంగాళదుంపల్లో కూరాలి. తరువాత వీటిని స్ల్తెసుల్ల కోసి ఓవెన్‌లో బేక్ చేయాలి. బంగారు వర్ణంలో, కరకర అయ్యే వరకు బేక్ చేసి తింటే చాలారుచిగా ఉంటాయి.

బంగాళదుంపలు - రెండు కప్పులు( మెత్తగా ఉడికించి చిదమాలి )
బోండాల మధ్యలో పెట్టడానికి ఉడకబెట్టిన బఠాణీలు - ఒక కప్పు
నూనె - ఒక చెంచా
తరిగిన అల్లం ముక్కలు - ఒక చెంచా
కారం - సగం చెంచా
ధనియాల పొడి - ఒక చెంచా
గరం మసాలా - సగం చెంచా
సన్నగా తరిగిన కొత్తిమీర - ఒక చెంచా
ఉప్పు - రుచికి తగినంత
బోండాల పైకి
శనగపిండి - సగం కప్పు
కారం - సగం చెంచా
వాము - సగంచెంచా
సోడా - చిటికిడు
నునె - వేయించడానికి సరిపడినంత
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం:
ఉడకబెట్టి చిదిమిన బంగాళ దుంపలకు కొద్దిగా ఉప్పుకలిపి పక్కన పెట్టుకోండి. ఒక పాన్‌లో నూనె వేడిచేసి బోండాల మధ్యలో పెట్టడానికి కావలసిన పదార్థాలన్నీ వేసి బాగా కలపండి. కొద్దిసేపు ఉంచి తీసేసి చల్లర్చండి. తరువాత కొద్ది కొద్దిగా తీసుకుని చిన్నగా లడ్డూల్లాగా చేయండి.ఒక గిన్నేలో శనగపిండి, కారం, వాము, సోడాఉప్పువేసి నీటి సహాయంతో బాగ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా కలపండి. ఇపుడు బంగాళదుంప మిశ్రమాన్ని తీసుకుని పూరీల ఒత్తి మధ్యలో లడ్డూల్ల చేసిన మిశ్రమాన్ని పెట్టి చివర్లు కలిపేయండి. ఈ బోడాలను కలిపి పెట్టుకున్న శనగపిండిలో ముంచి వేడినూనెలో వేసి బంగారురంగులో కరకరలాడేవరకు ఉంచి తీసేయండి.మధ్యలోకి కట్‌చేసి వడ్డిస్తే తినడానికే కాదు చూడడానికీ బాగుంటాయి.
కావలసినవి( కప్స్ కోసం )
మైదా - ఒకటిన్నరకప్పు
మెత్తగా రుబ్బిన బఠాణీలు -సగం కప్పు
ఉప్పు - సగం చెంచా
నూనె - రెండుచెంచాలు వేపడానికి సరిపడా నూనె
నింపడానికి
ఉడకబెట్టి ముక్కల్లా కోసిన బంగాళదుంపలు - ఆరు
ఉడకబెట్టిన శనగలు - రెండు చెంచాలు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు
ఉడకబెట్టిన బఠాణీలు - ఆరు చెంచాలు
చాట్ మసాలా - ఒక చెంచా
చిలికిన పెరుగు - ఒక కప్పు
కారం - సగం చెంచా
వేయించిన జీలకర్ర పొడి - ఒక చెంచా
ఉప్పు - తగినంత
పైన అలంకరించడానికి సన్న కారప్పూస, కొత్తిమీర కొద్దిగా, పుదీన పచ్చడి అల్లం పచ్చడి
తయారుచేసే విధానం:
మైదాపిండిలో రుబ్బిన బఠాణీ, ఉప్పు, నూనె కొద్దిగా నీరువేసి మెత్తగా కలపాలి. వీటిని చిన్న చిన్న ముద్దలు చేసుకుని పూరీలా ఒత్తాలి. ఇపుడు చిన్న స్టీలు గిన్నెతీసుకొని ఈ పూరీని గిన్నెలోపలికి భాగంలో గిన్నె ఆకారం వచ్చేలా ఒత్తాలి. తరువాత ఈ గిన్నెను వేడినూనెలో వేయాలి. నూనెలో వేయగానే గిన్నెనుండి పూరి ఊడిపోతుంది. వేంటనే గిన్నె తీసేయాలి. బంగారువర్ణంలోకి వచ్చిన తరువాత ఈ పిండిగిన్నెలను నూనెలోనుండి తీసేయండి. ఈ పిండిగిన్నెలో ఉడకించిన బంగాళదుంపలు, శనగలు, బఠాణీలు, ఉప్పు, చాట్ మసాలా వేసి పైన కొద్దిగా పెరుగు వేయాలి. వీటి మీద అల్లం చట్ని, పుదీనాచట్ని, సన్నకారప్పూస చల్లి తింటే బాగుంటుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in