|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
|
కందిపప్పు |
- |
పావుకిలో |
|
ఎండు మిర్చీ |
- |
10 |
|
జీలకర్ర |
- |
ఒక చెంచా |
|
ఉప్పు |
- |
సరిపడినంత |
తయారు చేసే విధానం :
కందిపప్పుని మాడనీయకుండా మంచి సువాసన వచ్చేలా వేయించాలి. అది వేగుతుండగానే ఎండుమిర్చి తొడిమలు లేకుండా అందులో వేయాలి. బాగా వేయించి ఈ పప్పుమిరపకాయల్తో తగుపాటి ఉప్పువేసి కొంచెం నీళ్ళు చిలకరిస్తూ మెత్తగా పచ్చడి రుబ్బుకోవాలి.
కావలసిన వస్తువులు:
|
క్యాబేజీ |
- |
50గ్రా|| |
|
ఆయిల్ |
- |
100గ్రా|| |
|
ఎండుమిర్చీ |
- |
10 |
|
చింతపండు |
- |
నిమ్మకాయంత |
|
ఇంగువముక్క |
- |
చిన్నముక్క |
|
పోపులు, పసుపు |
- |
కొంచెం |
|
ఉప్పు |
- |
సరిపడినంత |
తయారు చేసే విధానం :
కొంచెం ఆయిల్‌లో ఎండుమిర్చీ వేయించి తీసి పెట్టాలి. క్యాబేసీ తరగాలి. మరికొంచెం ఆయిల్ కాచి అందులో క్యాబేజీని పోసి ఆ మధ్యలో చింతపండు నుంచి పసుపు చల్లి కొంచెం నీళ్ళుపోసి మూతపెట్టాలి. నీళ్ళన్నీ ఇగిరిపోయి క్యాబేజీ బాగా వుడికాక దింపి చల్లారపెట్టాలి. వేయించిన ఎండుమిర్చీకి కాస్త ఉప్పును కలిపి నలిగేలాదంచి అందులో ఉడికిన క్యాబేజీని కలిపి పచ్చడిలా రుబ్బుకోవాలి. ఆఖర్న ఇంగువలో కలిపిపెట్టుకోవాలి.
కావలసిన వస్తువులు:
|
దొండకాయలు |
- |
పావుకిలో |
|
ఎండుమిర్చీ |
- |
25గ్రా|| |
|
చింతపండు |
- |
నిమ్మకాయంత |
|
పసుపు |
- |
చిటికెడు |
|
ఉప్పు |
- |
సరిపడినంత |
|
మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్న ఇంగువ ముక్క |
- |
కొంచెం |
తయారు చేసే విధానం :
కొంచెం నూనెలో మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేయించి వుంచుకోవాలి. దొండకాయల్ని అడ్డంగా రెండేసి ముక్కలుగా తరిగి రోట్లో వేసి కచ్చామచ్చాగా దంచి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన పప్పులూ, ఎండుమిర్చీ ఇంగువా మెత్తగా నూరుకోవాలి. అందులో దొండతొక్కు కలిపి మరింత మెత్తగ నూరాలి. ఇప్పుడు మిగిలిన నూనెనుకాచి ఆవాలు, జీలకర్రా వేయించి ఆ మొత్తం దొండకాయపచ్చడిలో వేసి కలిపాలి. ఇప్పుడు దొండకాయ పచ్చడి రెడీ.
కావలసిన వస్తువులు:
|
చేదులేని దోసకాయ |
- |
1 |
|
పచ్చిమిర్చి |
- |
6 |
|
ఎండుమిర్చి |
- |
6 |
|
ఆయిల్ |
- |
25గ్రా|| |
|
చింతపండు |
- |
25గ్రా|| |
|
ఉప్పు |
- |
సరిపడినంత |
తయారు చేసే విధానం :
దోసకాయ పెచ్చుతీసి ముక్కలుగా తరిగి పెట్టుకొఆవాలి. ఎండుమిర్చీ వేయించి సరిపడినంత ఉప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు కలిపి దంచి అందులో దోసముక్కల్నివేసి బగా దంచాలి. కారం అంతా సరిపడా కలవాలంటే పచ్చడినోసారి చేత్తో కలుపుకోవాలి.
కావలసిన వస్తువులు:
|
బెండకాయలు |
- |
పావుకిలో |
|
ఎండుమిర్చి |
- |
25గ్రా|| |
|
చింతపండు |
- |
రెండు రెప్పలు |
|
ఉప్పు |
- |
సరిపడినంత |
తయారు చేసే విధానం :
ఎండుమిర్చి బాగా వేయించి పెట్టుకోవాలి. బెండకాయల్ని కాయకి 3 ముక్కలుగా తరిగి ఆయిల్‌లో వెయ్యాలి. ఆ ముక్కల మధ్యనే చింతపండును వేసి పైన కాస్తనీళ్ళు చిలకరించి మూత పెట్టాలి. ముక్కలు చింతపండు యేకంగా మగ్గిపోయాక వేయించిన ఎండుమిర్చి, ఉప్పూ ఆ ముక్కలలో కలిపేసి రోట్లోవేసి, పచడి చేసెయ్యడమే.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in