telugudanam.co.in

      telugudanam.co.in

   

కంప్యూటర్ మరియు ఇంటెర్‌నెట్

నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్‌లేని జీవనాన్ని ఊహించుకోవడానికి కష్టమేమో. నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమంటూ లేదు. ఇంతటి అద్భుతమైన సాధనాన్ని కనిపెట్టిన మానవుడే నేడు దాని సహాయం లేకుండా నిమిషం కూడా గడవని స్థితికి చేరుకున్నాడంటే దీని శక్తిని మనం అంచనా వేయగలమా? ఇంతవరకూ మానవుడు ఆవిష్కరించిన మరే యంత్రము కంప్యూటర్ చూపినంత ప్రభావాన్ని చూపలేదంటే దీని ప్రాముఖ్యత ఎంత ఉన్నదో మనకు అర్థమవుతోంది, ఉదయం నిద్రలేవగానే చూసే న్యూస్‌పేపరు నుండి విద్యాలయాలు, ఆఫీసులు, పోస్టాఫీసు, రైల్వేస్టేషను ఎక్కడికి వెళ్ళినా మనకు తెలియకుండానే మన పనులు అన్ని కంప్యూటర్ ద్వారా జరుగుచున్నాయి. మన అవసరాలకు ఉపయోగపడుచున్న కంప్యూటర్ గురించి, 'కంప్యూటర్ అంటే ఏమిటి?' కంప్యూటర్ ఎలా పని చేస్తుంది? ఏ విధమైన అవసరాలకు కంప్యూటరును ఉపయోగించుకోవచ్చు మొదలగు విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.


కంప్యూటర్ అంటే ఏమిటి?

కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ (Electronic) సాధనము. ఇది మనం ఇచ్చిన సమస్య యొక్క డేటా (Input) స్వీకరించి, ముందుగా ఇవ్వబడిన ప్రోగ్రాము (Program) ప్రకారం డేటాను విశ్లేషించి ఫలితాలు (Output) అందజేస్తుంది.

 

డేటా తీసుకొనుట

 

ప్రోగ్రాం సహాయంతో

 

ఫలితములు ఇచ్చుట

 
       

                 Key Board                      (C.P.U.)                  Printer or Monitor

లెక్కలు చెయ్యటం కోసం కాలిక్యులేటర్‌గను, లెటరులు తయారు చెయ్యటం కోసం టైపు రైటర్‌గను (Type Writer), లెటరులు దాచుకోవటంకోసం అలమరగను, వీడియో గేములు ఆడుకోవటం కోసం వీడియో ప్లేయరుగను, పాటలు వినిపించుటకు టేపు రికార్డరుగను, సినిమాలు చూడగల టీ.వీ. (T.V.) గను, ఫ్యాక్టరీలలో మిషిన్‌లను, రోబోట్‌లను నియంత్రించే సాధనముగను, మానవ నిర్మిత గ్రహాలను (Satellite) నియింత్రించే సాధనముగను, ఇంకా అనేక అవసరముల కొరకు కొద్ది కొద్ది మార్పులతో కంప్యూటరును వాడుకొనవచ్చును.


కంప్యూటర్ పని చేయు విధానము:

కంప్యూటర్‌కు కావలసిన సమాచారాన్ని కీబోర్డ్, మౌస్ మొదలగు ఇన్‌పుట్ డివైసెస్ ద్వారా అందచేస్తాము. ఈ సమాచారము మైక్రోప్రొసెసరు లేదా C.P.U. (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్) నందలి మెమొరీ నందు భద్రపరచబడుతుంది. అవసరమును బట్టి డేటాను శాశ్వతముగా కాని, తాత్కాలికముగా కాని భద్రపరచవచ్చును.

కంప్యూటరు, ఎ. యల్. యు. (Arthimatic and Logic Unit) సహాయంతో డేటా నందలి గణిత, తార్కిక సమస్యలను పూరిస్తుంది. నియంత్రణ వ్యవస్థ మొత్తం కంప్యూటరును నియంత్రిస్తుంది. డేటాలో ఏ సమస్యను ముందు పూరించాలి, ఏ సమస్యను తరువాత పూరించాలో వివరిస్తుంది. ఇన్‌పుట్, అవుట్‌పుట్ పరికరములను నియంత్రిస్తుంది. కంప్యూటరునందలి అన్ని భాగములను సమన్వయపరుస్తుంది. సమస్య, సాధించుట ద్వారా వచ్చిన ఫలితములను కంప్యూటరు ద్వారా మనకు కావలసిన రూపములో బయటకు తీసుకొని వచ్చును. అవుట్‌పుట్, డివైస్ ద్వారా ఫలితములను కంప్యూటరు మనకు అందిస్తుంది.


కంప్యూటర్ ఉపయోగాలు:


ఇంటెర్‌నెట్ అంటే ఏమిటి?

ఇంటెర్‌నెట్ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు నెట్ వర్క్ గురించి తెలుసుకోవాలి, నెట్ వర్క్ అంటే కొన్ని కంప్యూటర్‌ల కలయిక. అదే కంప్యూటర్‌లను ప్రపంచ వ్యాప్తంగా ఒక దానికొకటి అనుసంధానిస్తే దానిని ఇంటెర్‌నెట్ అంటారు.ఇంకా ఇంటెర్‌నెట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే టెలిఫోన్, టి.వి, కంప్యూటర్ - ఈ మూడింటి కలయిక. టివి లో మనం నిర్వాహకులు ప్రదర్శించే దృశ్యాలను (ప్రోగ్రాంలను) మాత్రమే చూడగలము గాని మనకు ఇష్టం వచ్చిన సమచారాన్ని కాని, ప్రోగ్రాములను గాని పొందలేము. అదే కంప్యూటర్లో అయితే కేవలం మనం ఫీడ్ చేసిన ప్రోగ్రామ్‌లను మాత్రమే మనం చూసుకోగలము గాని ఇతర కంప్యూటర్‌ల ప్రోగ్రామ్‌లు చూడలేము . టెలిఫోన్‌లో మనం మాట్లాడగలమే కాని అవతల వారిని చూడలేము. ఈ నేపధ్యంలో పై టి. వి. కంప్యూటర్, టెలిఫోన్‌ల అపూర్వ కలయికతో కూడిన ఒక అద్భుతమైన పరికరమే ఈ ఇంటర్‌నెట్.

కాబట్టి ఇంటెర్‌నెట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా కలుపబడిన ప్రసార అల్లికా వ్యవస్థ. ఈ వ్యవస్థ వివిధ రకములైన కంప్యూటర్‌ల మధ్య కలుపబడిన కొన్ని లక్షల వ్యక్తులకు (users) సేవలందిస్తుంది. ఈ ఇంటర్‌నెట్ అనేది నివిధ రకాల కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల మధ్య కూడా సమన్వయం కుదిర్చి సమాచారాన్ని బట్వాడా (Dispatch) చేస్తుంది.


ఇంటెర్‌నెట్ ఉపయోగాలు:

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: