www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

కల్తీలను కనిపెట్టండి

ఆహార వస్తువులను కల్తీ చేయడం నేరం. కల్తీ పదార్ధాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఖనిజ తైలంతో కల్తీ చేసిన ఆవ నూనును ఉపయోగించిన వ్యక్తికి కంటిదృష్టి పోవచ్చు లేక గుండె జబ్బు రావచ్చు. సున్నితమైన రంపపు పొట్టుతో కల్తీ చేసిన మిరపకాయల పొడి తిన్న వారికి ఆరోగ్యం చెడిపోతుంది. అదేవిధంగా కల్మషమైన నీటితో కల్తీ చేసిన పాలు త్రాగిన బిడ్డ బాధపడుతుంది. ఈ కల్తీలను ఇంట్లో పరీక్షల ద్వారా సులభంగానే కనిపెట్టవచ్చు.

మంచి నెయ్యిగానీ, వెన్నగానీ వనస్పతితో కల్తీచేయబడిందని అనుమానం కలిగినప్పుడు ఒక చెంచాడు నేతినిగానీ, వెన్ననుగానీ తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్‌లో సమాన పరిమాణం గల హైడ్రోక్లోరిక్ ఆంలంతో కలిపి బాగా కదపాలి. టెస్ట్ ట్యూబ్ అడుగు భాగంలో ఎరుపు రంగు కనిపిస్తే నెయ్యిగానీ, వెన్నగానీ వనస్పతితో కల్తీ చేయబడిందని తెలుసుకోవచ్చు.పాలలో నీళ్ళు కల్తీ చేస్తే చాలా సులభంగా తెలుసుకోవచ్చు. నిలువుగా నున్నగా ఉండే అద్దంవంటి నున్నటి తలం మీద ఒక చుక్క పాలు వేస్తే చుక్కలా అలా నిలిచి ఉన్నప్పుడుగానీ లేక మెల్లగా క్రిందికి జారుతూ తెల్లగా గుర్తు ఏర్పడినప్పుడుగానీ పాలు కల్తీ లేనివి అని తెలుసుకోవచ్చు. కల్తీ చేసిన పాలైతే నిల్వకుండా శీఘ్రంగా పాల చుక్క జారిపోతుంది. పాల గుర్తు ఏర్పడదు.

వంట నూనెలు ఖనిజ తైలాలతో కల్తీ చేసినట్టు అనుమానం తగిలితే 2 మి.లీ. వంట నూనెకు సమాన పరిమాణంలో ఎన్/2 ఆల్కాహాలిక్ పొటాష్ కలిపి 15 నిముషాలపాటు ఉడుకుతున్న నీటిలో వేడిచేసి 10 మి.లీ. నీరు కలపాలి. మలినంగా కనిపిస్తే ఖనిజ తైలాలు కల్తీచేశారన్నమాట.

తియ్యని మిఠాయి, ఐస్ క్రీ,, షర్బత్ మొదలైన వాటిని ఒక్కొక్కప్పుడు మెటానిల్ యెల్లో (అనుమతింపమడని కోల్తార్ రంగు)తో కలుపుతారు. వీటిని కూడా కల్తీకి పరీక్ష చేయడం చాలా సులభం. రెండు మూడు చుక్కలు నిర్జల ఉదజహరికాంలం కాన్సెంట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్) కొద్దిగా మిఠాయితో కలపాలి. మజంతా రంగు ఏర్పడితే మెటానిల్ యెల్లో కలిపినట్లే.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in