|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
నూతన సంవత్సర వేడుకలు
కొత్త కొత్త ఆశలతో... నూతన ఆలోచనాల విధానాల సరళితో మార్పులు కోరుకొంటూ... మనిషిగాపుట్టిన ప్రతి ఆశాజీవి రాబోయే సంవత్సరం మరింత శోభాయమానంగా ఉండాలనే ఆకాంక్షతో పాత సంవత్సరపు వైభవాన్ని నెమరువేసుకొంటూ...విషాధచాయలని వదిలించుకొంటూ కనీసం కొత్త సంవత్సరం లో అడుగు పెట్టేవేళ అన్నీ శుభాలే కలగాలని ఆశిస్తూ వేడుకగా కులమతాలకతీతంగా, సనాతన సాంప్రదాయాలపట్టింపులు లేకుండా అన్ని దేశాలలో సర్వమానవ సౌబ్రాతృత్వం పరిపొందేలా వయో బేధం లేకుండా... పేద, గొప్ప అందరూ తమ శక్తికొద్ది జరుపుకొనే వేడుకే ఈ నూతన సంవత్సర సంబరం. ఈ నూతన సంవత్సరానికి ఆది అంతం అనేది ఉండదు. నూతనత్వాన్ని కోరుకోవడము లోనే గొప్ప మార్పు అనేది కనిపిస్తుంది. అలా ఆలోచించబట్టే ఆది మానవుడు నేడు అణుమానవుడైనాడు.
సంవత్సరం అంతా న్యూ ఇయరే...
జనవరి 1 న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కొన్నిదేశాలలో, కొన్ని ప్రాంతాలలో ఈ నూతన సంవత్సరంను ఒకొక్కరు ఒక్కొక్క నెలలో జరుపుకోవడం విశేషము. ఆరకంగా సంవత్సరంలో వచ్చే ప్రతినెలలోనూ ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు చోటు చేసుకోవడం గమనార్హం.
జనవరి 7 :- ఈజిప్షియన్లు న్యూఇయరుని ఈరోజున చేసుకొంటారు. మహాయాన బౌద్దులు ఈ రోజున వచ్చే పున్నమినుంచి మూడురోజులు జరుపుకొంటారు.
జనవరి 11 :- ఓల్డ్ స్మాటిష్ న్యూఇయర్ డే...
జనవరి 14 :- ఈస్త్రం ఆర్మిడాక్స్ న్యూఇయర్ డే...
జనవరి 21:- సెల్టిక్ న్యూఇయర్ డే...కొరియంసు న్యూఇయర్ ను సాల్-నాల్ అనిపిలుస్తారు. జనవరిలోనే వీళ్ళుకూడా న్యూఇయర్ ని జరుపుకొంటారు.
పిబ్రవరి :- జనవరి చివరి వారం లేదా పిబ్రవరి మొదటివారంలో టిబిటియంసు ఈవేడుకలను జరుపుకొంటారు. అంటే అమావాస్య రోజున ఈవేడుకలు జరుపుకోవడం విశేషం. వియత్నాం ప్రజలుకూడా పిబ్రవరిలోనే జరుపుకొంటారు.
మార్చి 1 :- రోమంసు న్యూఇయర్ డే
మార్చి 14 :- సిక్కుల న్యూఇయర్ డే
మార్చి 21 :- బహాయ్ న్యూఇయర్ డే. ఆంధ్రప్రదేస్ లోని తెలుగు ప్రజానీకం ఉగాది వేడుకలు నూతన సంవత్సర వేడుకలా మార్చిలోనే జరుపుకొంటారు. జొరాస్టియంసు కూడా మార్చి 21 నే జరుపుకోవడం విశేషం.
ఏప్రిల్ 14:- ఆగ్నేయాసియాలలో చాలా దేశాలు ఏప్రియల్ 14 న నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజునే నేపాలియన్లు జరుపుకొంటారు
మే :- మే మాసములో వచ్చే బుద్దపూర్ణిమను బౌద్దులు నూతన సంవత్సర గా భావిస్తారు. అందుకే ఆ రోజును న్యూఇయర్ డే గా చేసుకొంటారు.
జూను 21 :- ఏనిసెంట్ గ్రీక్ న్యూఇయర్
జులై 9 :- ఆర్మేనియం న్యూఇయర్
ఆగస్టు :- మళయాళిలు జరుపుకొనే న్యూఇయర్
ఆగస్టు 28:- జొరాస్టియం న్యూఇయర్
సెప్టెంబర్ 1 :- ఆర్ధడక్స్ క్రిస్టియం న్యూఇయర్ పండుగను ఎక్కువగా రష్యన్లు జరుపుకొంటారు.
సెప్టెంబర్ 11 :- ఇధోపియంస్ నూతన సంవత్సర వేడుకలు చేసుకొంటారు.
అక్టోబర్ 3 :- మొరాకో నూతన సంవత్సర వేడుకలు చేసుకొంటారు.
నవంబర్ :- ఇండియాలో కొన్ని మతాలకు చెందిన వారు నవంబర్లో వచ్చే దీపావళిని నూతన సంవత్సరముగా భావిస్తారు. జైనులు దీపావళి పండుగ రోజున తమ వ్యాపార సంభందిత కొత్త పుస్తకాల ఎకౌంట్ ఆరంభిస్తారు.
డిసెంబరు :- సిక్కింలో డిసెంబరులో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. మధ్య ప్రాచిన యుగంలో ఇంగ్లాండ్ దేశమ్లో డిసెంబరు 25 జీసస్ పుట్టిన రోజుని నూతన సంవత్సర వేడుకగా జరుపుకొంటారు.
క్రైస్తవ సంప్రదాయం ప్రకారం...
మామూలుగా అందరం జనవరి 1 వ తేదీన ప్రతి సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాము. ఇది మెసపటోమియా నాగరికత కాలములో సుమారు రెండువేల సంవత్సరాల క్రితం ఈక్వినాక్స్ పాలన కాలములో మార్చినెల సగం రోజుల తరువాత ఈజిప్షియంసు పెర్షియంసు, ఫోనిషియంసు, గ్రీక్సు వేడుకగా జరుపుకొనేవారు. సాధారణంగా వసంత కాలములో మొదలై శిశిర కాలములో ముగుసేది. అయితే దానిని నూమా పాంపిలియం పాలనలో 12 నెలలగా క్యాలెండరును మార్చారు. చంద్రమానం ఆధారంగా ఆ క్యాలెండర్ తయారు చేశారు. అప్పటిదాకా 10 నెలలతోనే ఉన్న ఆ క్యాలెండర్ లో రోజులను కుదించి నెలకు 30 రోజులు వచ్చేలా చేసి జనవరి, ఫిబ్రవరి నెలలను కూడా ఆ క్యాలెండర్లో చేర్చడమేకాకుండా... జనవరి 1 నుంచి నూతన సంవత్సరం ఆరంభం అవుతుందని ప్రకటించారు.
హిందూ సంప్రదాయం...
హిందువులుకూడ మొదట్లో చంద్రుని గమనాన్ని లెక్కలు వేసుకొని విక్రమశకాన్ని మూలంగా తీసుకొనేవారు. క్రీ.పూ. 57 సం|| లో విక్రమ సకం ప్రారంభం అయినది అంటారు. అంతకుముందు మొదట్లో దీనిని తర్వాతవచ్చే కార్తీకమాసం తొలిరోజున నూతన సంవత్సరం మొదలుగా జరుపుకొంటారు. హిందువులందరూ అమితంగా కీర్తించే విక్రమాదిత్యుని పాలనకు ముందు శకవంశానికి చెందిన శకస్ధునుడి పాలన సాగుతుండేది. ఒకసారి గార్ధబిల్ల అనే రాజు వేటకు వెళుతుండగా మార్గ మధ్యమ్లో సరస్వతి అనే వితంతువుని చూసి చెరపడతాదు. ఆమె జైన సన్యాసి అయిన అల్మాచార్య సోదరి. అప్పుడు ఆ సన్యాసి అప్పుడాసన్యాసి గత్యంతరం లేక శక వంశానికి చెందిన శకస్తన మహారాజును చేరుకొని తనని రక్షించమని వేడుకొన్నాడు. అప్పుడు శకస్థనుడు గార్ధబిల్లుని పై దండెత్తి అతనిని ఓడిస్తాడు. ఓటమి పాలైన గార్ధబిల్లుడు అడవుల పాలై పులిచేతిలో మరణిస్తాడు. అతనికుటుంబం కూడా అడవుల పాలవుతుంది. తరువాత అతని కుమారుడైన విక్రమాదీత్యుడు. సైన్యాన్ని సమీకరించుకొని కొంతబలాన్ని సమీకరించుకొన్నాక నాటి శకవంశపు రాజును ఓడించి తాను సింహాసనాన్ని అధిష్టించడమేగాక... జనరంజకంగా పాలించాడు. ఆయన పాలననే హిందువులు నేటికీ పంచాంగములలో విక్రమ నామ శకంగా చెప్పుకొంటారు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in