www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

సైన్స్ సంగతులు

1. బొగ్గు: బొగ్గును చూర్ణం చేసి వేడి వేయటం ద్వారా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్‌లో సల్ఫర్ ఏమీ ఉండనంత వరకూ సాంద్రీకరించి ద్రవస్థితికి తీసుకొస్తారు.

2. కార్బన్ ఉద్గారాలు: బొగ్గు, సహజవాయువు ఆధారంగా నడిచే విద్యుత్ ఉత్పత్తి  కేంద్రాల్లో కార్బన్ ఉద్గారాలు ఉంటాయి. వీటిని భూగర్భంలోకి పంపే టెక్నాలజీలు అవసరం.

3. హైడ్రోజన్: ఫ్యూయల్‌సెల్‌లో హైడ్రోజన్‌ను ప్రాసెస్ చేసినప్పుడు విద్యుత్  విడుదలవుతుంది. నీరు ఉప ఉత్పత్తిగా వెలుపలికి వస్తుంది.

4. మీధేన్: చెత్తాచెదారం, కుళ్లిపోయిన పదార్ధాలు, మృతకళేబరాలు ఇటువంటి వాటితో నిండి ఉండే స్థలాల నుంచి మీధేన్ ఉత్పత్తి అవుతుంది. దీనిని సేకరించే టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వీటిని మరింత సమర్ధవంతంగా ఎలా వినియోగించుకోవాలన్నదే ఇప్పుడున్న ప్రశ్న.

5. గ్యాసు నుంచి ద్రవం: కార్బన్, హైడ్రోజన్ మూలకాలను సహజవాయువులో కలిపి కృత్రిమ పెట్రో సంబంధ ద్రవాలను తయారుచేస్తారు. డీజిల్ తయారయ్యేది ఈ పద్ధతిలోనే.

6. అణుశక్తి: ఈ పద్ధతిలో కాలుష్యకారక ఉద్గారాలు ఏమీ ఉండవు. అయితే, దీనిలో వెలువడే రేడియోధార్మిక పదార్ధాల ద్వారా ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం అన్నది చాలా ఖరీదైన పని. ఈ నేపధ్యంలో, ప్రస్తుతం కేంద్రక సంలీనం ఆధారంగా పని చేసే అణురియాక్టర్లకై పరిశోధనలు జరుగుతున్నాయి.

 7. భూగర్భ శక్తి: భూగర్భంలో ఉండే బ్రహ్మండమైన వేడిని ఉపయోగించి ఆవిరిని వేడిచేస్తారు. ఈ ఆవిరి ద్వారా టర్బైన్‌లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు.

8. జీవసంబంధ వనరులు: అత్యంత ప్రాచీనకాలం నుంచి మనిషికి తెలిసిన వనరులివి. దీనిలో బొగ్గు బదులు కలప, ఎరూ, బయోడీజిల్, ఇధనాల్ తదితరమైన వాటిని ఉపయోగించి కరెంటును ఉత్పత్తి చేస్తారు.

9. జల, పవన, సౌరశక్తులు: ఇవన్నీ బాగా ఉపయోగపడేవే. అయితే, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలతో పోలిస్తే వీటిని ఉపయోగించుకోవటం చాలా ఖరీదైన వ్యవహారం. వీటి వినియోగానికి భారీ ప్రాజెక్టులు అవసరం. అంతేగాక అనేక దేశాల్లో ఈ ప్రకృతిశక్తుల వినియోగానికి పలు పర్యావరణ నిబంధనలు అడ్డు వస్తుంటాయి.

మూలం : గురువారం జనవరి 19, 2006 ఈనాడు


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in