www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

 ఆత్మ గౌరవం

ఎవరైతే కష్టించి పని చేస్తారో, ఙ్ఞానవంతులో, తెలివి కలవారో, నైపుణ్యం కలవారో అటువంటి వారు అన్ని చోట్లా గౌరవింప బడతారని జగమెరిగిన సత్యం. అఙ్ఞానులు, అసమర్ధులు, సోమరిపోతులు, మందబుద్దులు ఎల్లప్పుడూ అవమానాల పాలవుతారు. ఎన్ని సార్లు అవమానించ బడినా, చీత్కరించబడినా, అనేక సార్లు హెచ్చరించబడినా, తాఖీదులందుకొన్నా, తమతప్పులకు చివాట్లు తిన్నా, చివరకు శిక్షించబడినా కూడా కొంతమంది తమకు తాము మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించరు.  అటువంటి వాళ్ళు బాధపడరు. నిస్పృహకు, ఒత్తిడికి లోనవుతారు. దిగులుతో మధనపడతారు, అన్ని రకాల శారీరక మానసిక రోగులకు లోనవుతారు. అవమానాన్ని తప్పించుకోవడనికి దీర్ఘకాలం  సెలవు పెడతారు. ఏదో ఒకటి చేసి తప్పించుకు తిరగాలనుకొంటారు కానీ ఆత్మ గౌరవం లేకపోవడంవల్ల తమ ప్రవర్తనను మార్చుకోరు, కానీ సున్నితమైన మనసు కలవారు అవమానము మరణం కంటే ఘోరమైనదని భావించి తమ మర్యాదను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి  ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. తమ మానంపట్ల ఆత్మ గౌరవంపట్ల వారికున్న ప్రేమ వారిలొ ఉన్న ఆత్మ గౌరవాన్ని వెలికి తీయడానికి సహాయ పడుతుంది. అందుచేత వారు పరిస్థితికి  అనుగుణంగా ఎదిగి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొన గలుగుతారు.

మహాకవి కాళిదాసు చిన్నతనంలో నిరక్షరాస్యుడు, మందబుద్ది, రాజకుమారి 'విద్యోత్తమ ' మహామేధావి. కొందరు పండితులు ఆమెతో వాదనకు దిగి ఓడిపోయారు. వారు ఆమె మీద కక్షతో మోసంచేసి కాళిదాసుతో ఆమెకు వివాహం జరిగేలా చేశారు. వివాహం తరువాత నిజం బయట పడినది. రాజకుమారి ఎంతో కలత చెంది, అతడి అఙ్ఞానాన్ని తూలనాడుతూ, చులకనచేసి మాట్లాడింది.  కాళిదాసుకు తన మానమే పణంగా మారింది. అతడి మనస్సు అవమానంతో తీవ్రంగా గాయపడినది. ఆ పరిస్థితినే  కాళిదాసు ఒక సవాలుగా తీసుకొని గొప్ప కవిలా తయారవ్వాలని అనుకొన్నాడు. అతడి ఆత్మ గౌరవం అతడి ఆత్మవిశ్వాసాన్ని రగిలించింది. ఇంటిని విడిచిపెట్టి, ఆఖండ ప్రఙ్ఞావంతుడైన కవిగా తిరిగివచ్చాడు.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in