www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

మృత్యువుకు భయపడవద్దు

ఒక చెట్టునుంచి రాలే ఆకు మృత్యువుకి భయపడుతుందా? ఒక పక్షి మృత్యువుకు భయపడుతూ జీవిస్తుందని అనుకుంటున్నావా? మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు దానిని అది కలుసుకుంటుంది. అంతేగాని మృత్యువును గురించి ఆందోళన చెందదు. కీటకాలను పట్టుకు తింటూ, గూళ్ళు నిర్మించుకుంటూ, పాటలు పాడుకుంటూ, నిశ్చింతగా  జీవించడానికి కుతూహలపడుతుంది. వాటంతట అవి విరామం లేకుండా ఆనందపడుతున్నట్లు కనిపిస్తాయి. వాటికి మృత్యువును గురించి చింతే ఉండదు. మృత్యువు ఆసన్నమైందా, రానీ వాటి పని అవి చేస్తాయి. ముందు ఏంజరుగుతుందో అనే ఆందోళన ఉండదు. క్షణం క్షణం సజీవంగా ఉంటాయి. మనకే, మనుష్యులకే మృత్యువు అంటే భయం. ఎప్పుడూ భయపడుతూంటాం. వృద్ధులు మృత్యువుకు చేరువగా ఉంటారు. యువకులు కూడా దీనికి ఎంతో దూరంలో ఉండరు. మృత్యుభావంతో మనం నిమగ్నులమై ఉంటాం. ఎందుకంటే మనకు బాగా తెలిసిన దాన్నిగాని, సంగ్రహించి పెట్టుకున్న దాన్నిగాని పోగొట్టుకోడానికి భయపడతాం. చేసుకున్న భార్యనుగానీ, భర్తనుగానీ, బిడ్డనుగానీ, స్నేహితునిగానీ పోగొట్టుకోడానికి భయపడతాం. మనం తెలుసుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. సంపాదించుకున్న దానిని పోగొట్టుకోడానికి భయపడతాం. మనం ప్రోగుచేసుకున్న వాటినన్నిటినీ - మన స్నేహితులను, మన ఆస్తులను, సంపత్తులను, మన గుణాలనూ, శీలాన్ని కూడా తీసుకువెళ్ళగలిగినప్పుడు మనం మృత్యువు అంటే భయపడం. అందుకే మృత్యువు గురించి, దాని తరువాత జీవితాన్ని గురించి, ఎన్నెన్నో సిద్ధాంతాలను సృష్టించుకుంటాం. కానీ అసలు విషయం మృత్యువు అంటే అది అంతం. దీనిని అనుభవించడానికి సమ్మతించం. తెలిసిన దానిని వదలదలచుకోము. కాబట్టి తెలిసినదానికి అంటిపెట్టుకుని ఉండడం వల్ల మనలో  భయం కలుగుతూంది. అంతేగానీ తెలియని దానివల్ల కాదు. తెలియని దానిని తెలిసిన దానితో గ్రహించలేం. కానీ మన మనస్సు తెలిసినవాటితో ఉండి "నేను అంతం అయిపోతున్నాను" అన్నప్పుడు భయపడిపోతుంది.

- జిడ్డు కృష్ణమూర్తి


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in