|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సర్దుకుపోదాం
తమ దైనిక చర్యకు భంగం వాటిల్లితే కొంతమంది పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారవుతుంది. తాము అనుకున్నట్లు లేదా తమ ప్రణాళిక ప్రకారం జీవితం ముందుకు సాగకపోతే కొంతమంది తమ సమతౌల్యాన్ని కోల్పోతారు. అయినా మన జీవితపు జయం - అపజయం ఈ రెండూ, మనం కఠినమైన దాన్ని మృదువుగా మార్చుకోగలిగి జీవితం నుండి ఉత్తమమైన దాన్ని ఎలా రాబట్టుకోగలమన్న విషయంపైనే ఆధారపడి వుంటాయి.
ఈ క్రింద ఇవ్వబడిన పరీక్షను చేయడానికి ప్రయత్నించండి. చివరిలో ఇవ్వబడిన జవాబులను చూసేందుకు ముందు "అవును", "కాదు" అని జవాబులు వ్రాసుకుంటూపొండి.
వాతావరణం ఉత్సాహవంతంగా లేనప్పుడు మీరు సంతోషంగా, ఆనందంగా ఉండగలరా?
కుటుంబ సభ్యులు - భార్యాపిల్లలు - బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడంలో ఆనందాన్ని అనుభవిస్తారా?
మీరు చిన్న పిల్లలతో, వయసు మళ్ళినవారితో, మీ తరం వారితో సర్దుకుపోగల సామర్ధ్యం కల అతిధులా?
కుటుంబపరమైన దినచర్య అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నప్పుడు ఇతరులకు సహాయపడడంలో భాగస్వాములు అవుతారా?
చేస్తున్న పని కాకుండా పని మార్పును ఇష్టపడతారా?
మీ ఉన్నత అధికారి పదవీ విరమణ చేసినప్పుడు ఆ వచ్చే వ్యక్తితో ఎలా ఉండాలన్న భావన లేకుండా అతడి స్థానంలో వచ్చిన వ్యక్తిని ఆహ్వానిస్తారా?
సంస్థలో మార్పులు చేసినప్పుడు లేదా కొత్త పద్ధతులను ప్రవేశపెట్టినప్పుడు మీరు సహకారాన్ని అందిస్తారా?
తెలియని స్థలంలో, తెలియని మనుష్యుల మధ్య గట్టి ప్రయత్నం చేయకుండా స్థిరపడిపోగలరా?
అన్ని రకాల మనుషులతో సులభంగా సర్దుకుపోగలరా?
సులభంగా కొత్తవారిని మిత్రులుగా చేసుకోగలరా?
సమయానికి మీతో తోడ్పడకుండా, మీకు ఇతరులు నిరాశను కలిగించినప్పుడు మీ మానసిక శాంతిని కాపాడుకోగలరా?
మీ తప్పులనుండీ, మీ అపజయాల నుండీ మీరు పాఠాలు నేర్చుకుంటారా?
మీ పాత అభిప్రాయాలనూ, ఉద్దేశాలనూ తొందరగా మార్చుకోగలరా?
మీ కోరిక, మీ సామర్ధ్యానికి దూరంగా ఉన్నప్పుడు సాధించలేనిదాని వెంట పరుగెత్తడం కంటే బాగా ఆచరించగల పనులలో మీ సామర్ధ్యాన్ని వెచ్చించగలరా లేక నేను బొత్తిగా పరాజయాన్ని పొందానన్న భావనను కలిగి ఉంటారా?
మీ కంటే ఎక్కువ ఉన్న వారిని చూసె మీ జీవితాన్ని పాడుచేసుకోకుండా మీకున్నదానిని లాభదాయకంగా వాడుకుంటారా?
ప్రతి "అవును"కు 5 మార్కుల ప్రకారం ఇవ్వండి. 55 మార్కులు చాలా మంచి మార్కులు. 45 మార్కులు మంచి సరాసరి మార్కులు. 35-45 మధ్య మార్కులు సంతోషజనకమైన మార్కులు. 35 లోపు మార్కులు సంతోషజనకమైనవి కావు. సర్దుకుపోవడానికి ఉత్తమ స్థాయి పరిపక్వతను కలిగివుండాలి. అందుకే మీ వైఖరిని, ప్రతి క్రియలను ఉత్తమంగా ఉంచుకోగల లక్ష్యాన్ని కలిగి ఉండాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in