|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
మనసారా నవ్వండి
మానవ జీవితాన్ని నేడు ప్రభావితం చేస్తున్న
అనేక అంశాల్లో జాతి రత్నాలు ధరించడం ఒకటి. ఒక్కో రత్నం ఒక్కో అంశంపై ప్రభావితం
చూపుతుందనేది ఓ నమ్మకం. ఆరోగ్యానికి ఒక రత్నం, ఆర్ధిక స్థితిగతులకు మరోటి ... ఇలా
ఒక్కో ఒక్కో రత్నం ఒక్కో విధమైన ప్రభావితం చూపుతుందనే నమ్మకం ఉండబట్టే ఎవరి పరిధిలో
వారు ఈ జాతి రత్నాలను ఉంగరాల రూపంలోనో, మాలల రూపంలోనో నేడు ధరిస్తుండడం సర్వసాధారణం
అయిపోయింది. నవరత్నాలనూ ఒకే ఒక్క ఉంగరంలో కూర్చి ధరించే వారు కూడా నేడు అనేకమంది.
ఇన్ని రత్నాలను ఒకసారి కొని, ధరించడం అనేది ఆర్ధికంగా ఎంతో భారమైన విషయం. అందుకే
ఎంతకంటే విలువైన రత్నాలను పైసా ఖర్చు లేకుండా ధరించే అవకాశమున్నా మేలు జాతి
రత్నాలంటూ వాటివైపే మొగ్గు చూపుతున్నాడు సగటు మానవుడు. పైసా ఖర్చు లేకుండా
ధరించగలిగే రత్నాల గురించి సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్లనే వాటి గురించి
తెలుసుకోలేకపోతున్నాడు. అసలు పబ్లిసిటీ అవసరం ఎంతమాత్రమూ లేని ఆ నవరత్నాలను పైసా
ఖర్చులేకుండా అందించే ఒకే ఒక్క సూత్రమే "నవ్వు". ఎంత అనారోగ్యమున్నా, ఎన్నెన్ని
బాధలున్నా నవ్వుతూ కొన్నిటిని మరచిపోవచ్చు. కొన్ని అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు.
అంతెందుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే ఆయుర్దాయాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే "నవ్వితే
నవ రత్నాలు" అన్నారు. నవరత్నాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న నవ్వు అంటే ఇష్టపడని
వారెవరుంటారు ఈ ప్రపంచంలో.
ఈ సృష్టిలో ఉన్న అనంతకోటి జీవరాశిలోనూ మానవుడు
ఒక్కడే నవ్వనేర్చిన వాడు. నవ్వు మనిషికి అపురూపమైన వరం. మన ఉత్సాహపు బాటరీలను నవ్వు
తిరిగి తిరిగి భర్తీ చేస్తుంది.
సంతోషం కలిగినప్పుడు, ఉత్సాహభరితులం అయినప్పుడు, లేదా మన సంతోషాన్ని ఇతరులకు
ప్రకటించాలనుకుల్లప్పుడు మనం నవ్వుతాం.
మన ఆత్మీయులకు దీనిని కానుకగా ఇస్తుంటాం. ఈ కానుకను స్వీకరించడానికి ఎవరూ మొహమాటపడరు.
పైగా ఇటువంటి మరిన్ని కానుకలు తీసుకోవడానికి ముందుకొస్తారు. ఇచ్చేవారిని
అభిమానిస్తారు. ఆశీర్వదిస్తారు.నవ్వడం చేతకాని వాడంటూ ఎవరూ ఉండరు. నిత్య జీవితంలోనే
కాకుండా అన్ని వృత్తులలోనూ ఇది అవసరమైన విద్య. హాయిగా, ఆహ్లాదంగా నవ్వడం వేరు,
వృత్తిరీత్య నవ్వడం వేరు. ఇది తెచ్చిపెట్టుకున్న నవ్వైనప్పటికీ ఆ వృత్తికి గౌర
మర్యాదలనే తెచ్చిపెడుతుంది.
"కాస్త నవ్వితే నీ సొమ్మేంపోతుంది" అని
ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవాళ్ళని వారి తాలూకువారు అనడం రివాజు. నిజంగానే నవ్వితే పోయే
సొమ్మేమీ లేదు. పైగా నవ్వడం వల్ల వచ్చే ఆరోగ్యమనే
ఆస్తిపాస్తులుతప్ప.. పగలబడి నవ్వడమే
నవ్వు కాదు. ఎదుటి వ్యక్తిని పలకరింపుగా నవ్వే ఒకే ఒక్క చిరునవ్వు చాలు మనం
ఎదుటపడ్డ ప్రతిసారీ ఆ వ్యక్తి మనపట్ల అభిమానాన్ని ప్రకటించడానికి. మనం ఎల్లప్పుడూ
నవ్వుతూ ఉంటేనే లోకం మన నవ్వుతో శ్రుతి కలుపుతుంది. మన బాధలు, కష్టాలు చెప్పడం
ప్రారంభిస్తే ఇవ్వరూ మన దరికి చేరరు. దుఖాన్ని ఒంటరిగానే అనుభవించడం శ్రేయస్కరం.
మనకి దుఖాలు ఎన్నున్నా
ఎదుటవారి ముందు బయటపెట్టకుండా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ
ఉంటుంటే మన దుఖాలు ఎప్పటికైనా గ్రహించిన మన ఎదుటివారు మనం అడక్కుండానే
ప్రతిస్పందిస్తారు. మనం కాదన్నా మన కష్టాల్లో పాలుపంచుకుంటారు. నవ్వుకు అంత శక్తి
ఉంది మరి.
మన సంతోషాన్ని పెంచి, మనస్సును ప్రశాంతపరిచి, నాడీ మండలానికి కాస్తంత సేదనిచ్చే నవ్వు మన ప్రమేయం లేకుండానే మనం తీసుకునే టానిక్. ఈ టానిక్ మన కార్యదక్షతను పెంచుతుంది. మనలోని నెగటివ్ థింకింగ్‌ను పారద్రోలుతుంది. సహజసిద్ధమైన నవ్వు సంబంధాలను దృఢం చేస్తుంది. చేపట్టిన పనిని ఎంత త్వరగా పూర్తిచేద్దామా అని కాకుండా, ఎంత సరదాగా చేద్దమా అనుకుంటూ చేస్తే ఆ పని మనం అనుకున్న దానికంటే త్వరగా పూర్తవుతుంది. ఈ సరదానే నవ్వు. "నవ్వని రోజే మనం పూర్తిగా కోల్పోయిన రోజు అవుతుంది" అన్నాడు ఆస్కార్ వైల్డ్.
సమస్త జీవకోటిలో మనిషికి మాత్రమే భూషణమైన నవ్వును బలవంతంగా ఆపుకోవద్దు. భళ్ళున నవ్వడం భలే పసందని మరువద్దు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in