www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

మనోదక్షతకు మార్గాలు

తమ శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు క్రీడాకారులు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతూ మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ప్రతి మనిషీ ఏ రంగంలో ఉనా మానసికంగా కూడా అటువంటి శక్తి సామర్ధ్యాలను సంపాదించుకోవచ్చు. మానసికి శక్తి సామర్ధ్యాలను విస్తృతపరుచుకుంటే సావధానత పెరుగుతుంది. దానివల్ల కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే చతురత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒక ఉన్నతిని సాధించవచ్చు. అనేకమైన లాభాలను పొందవచ్చు. అందుకు నిశ్చలమైన అభ్యాసం, ఆత్మశిక్షణ, తగిన ఉద్యమం అవసరం.

వ్రాతమూలకంగాగానీ, సంభాషణమూలకంగాగానీ మన భావాలను వెల్లడించడం తృప్తికరమైన అనుభూతి. దీనివల్ల  యోచనాశక్తి అభివృద్ధి పొందుతుంది. చెప్పగలగడంలో నైపుణ్యం, నేర్పు అభ్యాసం వల్ల ఏర్పడుతుంది.మరో మార్గం కలం స్నేహం ఏర్పరచుకోవడం. ఒంటరిగా ఉన్నవారెవరో తెలుసుకుని అటువంటి వారితో వ్రాతమూలకంగా సంబంధం పెంచుకోవాలి. టెలిఫోన్‌లో మాట్లాడడంకంటే ఉత్తరం వ్రాయడమే ఉత్తమం. నీవు వ్రాసే ఉత్తరం నువ్వు గర్వపడేట్టుగా ఉండాలి. వార్తా పత్రికలకు జాబులు వ్రాస్తుండాలి. ఆశయాలను పెంచుకోవడానికి ఇదో మార్గం. ఈవిధంగా ప్రయత్నిస్తే పెద్ద వ్యాసాలు, చిన్న వ్యాసాలు, కథలు, నాటకాలు బ్రహ్మాండంగా వ్రాయవచ్చు.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in